DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కడపలో  81 అడుగుల శ్రీనివాసుని చూసి తరించండి. . .

ఆకర్షణీయం అపర రామానుజులు చిన్న జీయర్ విగ్రహ దర్శనం  

తిరుమలలో అంగుళాలు, à°•à°¡à°ª లో అడుగులు నిలువెత్తు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

.

à°•à°¡à°ª / విశాఖపట్నం, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ చరిత్రలో 81 అడుగుల అత్యంత భారీ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

అపరరామానుజులుగా ఖ్యాతి గాంచిన త్రిదండి చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆవిష్కరణ కావించబడింది.  à°…త్యంత సుందరంగా దర్శనమిచ్చే à°ˆ సుందర మూర్తిని

చూసేందుకు భారీ సంఖ్యలో వస్తున్నా భక్తులకు మరింత ఆశ్చర్యకరమైన  à°¦à°°à±à°¶à°¨à°‚ లభిస్తుంది. ఇదే ప్రాంగణంలో అపర రామానుజులు చిన్న జీయర్ స్వామి అత్యంత సుందరమైన విగ్రహ

రూపంలో  à°¦à°°à±à°¶à°¨à°‚ ఇస్తూ, భక్తులకు మంగళశాసనములు అందించడం ఆకర్షణీయంగా నిలుస్తోంది. 
తిరుమల శ్రీనివాసుని రూపాన్ని యధాతధంగా 81 అడుగుల ప్రణామం లో అత్యంత

సుందరంగా తీర్చిదిద్దారు. కాలివ్రేళ్ళ నుంచి, కిరీటం వరకూ, చేతి గోళ్ళ నుంచి ఆభరణాల వరకూ సాక్షాత్తు తిరుమల శ్రీవారి రూపం భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ నెల 5 న

ఆవిష్కరణ జరిగిన à°ˆ ఆలయం à°•à°¡à°ª జిల్లా కేంద్రం à°•à°¡à°ª శివారు గ్రామం లో ఉంది. ఇక్కడికి చేరుకునేందుకు బస్సు, రైలు, విమాన మార్గం కూడా అందుబాటులో ఉండడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam