DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15లోగా పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించాలి : ఖజానా డిడి నిర్మలమ్మ

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : శ్రీకాకుళం జిల్లాలోని  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వ పింఛనుదారులు à°ˆ నెల

15లోగా  à°¤à°® లైఫ్ సర్టిఫికేట్లను బయోమెట్రిక్ ద్వారా లేదా వ్యక్తిగతంగా ట్రెజరీకి సమర్పించాలని జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు జి.నిర్మలమ్మ పేర్కొన్నారు.

పింఛనుదారులు తమ  à°²à±ˆà°«à± సర్టిఫికేట్లు సమర్పించేందుకు à°ˆ ఏడాది జనవరి 1 నుండి ఫిబ్రవరి 29 వరకు గడువు ఇవ్వడం జరిగిందని, దానిని మార్చి 15 వరకు పొడిగించినట్లు ఆమె

వివరించారు. జిల్లాలో సుమారు 19వేల మంది పింఛనుదారులు ఉన్నారని, వీరిలో ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 315ను అనుసరించి పింఛను పొందుతున్న కుటుంబ పింఛనుదారులు, కారుణ్య

నియామకం ద్వారా ఉద్యోగం మరియు పింఛను పొందుతున్న కుటుంబ పింఛనుదారులు అవసరమైన ధృవీకరణ పత్రాలతో తమ               ఉప ఖజానా కార్యాలయాలకు వ్యక్తిగతంగా హాజరై సంబంధిత

పత్రాలు సమర్పించాలన్నారు. అదేవిధంగా విభిన్నప్రతిభావంతుల పింఛనుదారులు అభ్యర్ధి మెడికల్ సర్టిఫికేటుతో హాజరుకావాలని, మెడికల్ సర్టిఫికేటు 3ఏళ్లు దాటిన ఎడల

మరలా కొత్త మెడికల్ సర్టిఫికేటును పొంది ఉప ఖజానాధికారులను సంప్రదించాలని ఆమె కోరారు.

        మార్చి 15లోగా జిల్లాలోని ఉప ఖజానా కార్యాలయాలు, మీ – సేవా

కేంద్రాలు, నెట్ సెంటర్లు, జిల్లా ఖజానా కార్యాలయంలో బయోమెట్రిక్ / ఐరిస్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్లు స్వీకరించడం జరుగుతుందని అన్నారు. అనారోగ్య కారణాల వలన ,

వృద్ధాప్యం వలన లైఫ్ సర్టిఫికేట్లు సమర్పించని వారు సంబంధిత ఖజానా కార్యాలయాలకు సమాచారం ఇచ్చిన ఎడల ఉప ఖజానా అధికారులు స్వయంగా వచ్చి లైఫ్ సర్టిఫికేట్లను

స్వీకరిస్తారని లేనియెడల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయగలరని ఆమె వివరించారు. సి.ఎఫ్.ఎం.ఎస్ పేజ్-2 వలన పింఛనర్ల బదిలీలు ఈ నెల 10 నుండి తీసుకోబడవని, దీనిపై మరలా

ప్రభుత్వం ఉత్తర్వులు మంజూరుచేసిన పిదప బదిలీలు చేయడం జరుగుతుందని ఆమె స్పష్టం చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam