DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్ఫూర్తి దాతలు. . ఈ వీర మహిళా సైనికాధికారులు . 

వీరందరి కధనాలు వింటే హృదయం ద్రవించి పోతుంది. . . . . 

వీరమరణం పొందిన సైనిక భర్తల స్ఫూర్తిగా సైన్యం లో ప్రవేశం  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం

)

విశాఖపట్నం, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : ఎందరో మహిళారత్నాలు స్ఫూర్తిదాతలు à°—à°¾ నిలిచి యువతరానికి మార్గదర్శకులుగా నిలుస్తున్నారు. వారందరి కంటే ఎన్నో రేట్లు

స్ఫూర్తిదాతలుగా నిలిచిన వారిలో వీర మహిళా సైనికాధికారులు ఎందరో ఉన్నారు. అయితే వీరిలోనూ కొందరు మరింత ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వీరు సైనిక శిబిరాల్లో,

శత్రు దేశాల వారితోను, ఉగ్రదాడుల్లో సైతం పాల్గొని విజేతలుగా నిలిచారు. 

వీరి జీవన గాధలు వింటే ప్రతి ఒక్కరి హృదయం ద్రవించి పోతుంది. శత్రు సైనికులు,

ఉగ్రవాదుల దాడులను ఎదుర్కొంటు వీరమరణం పొందిన సైనికులు భార్యలు వీరు. ఇలాంటి పరిస్థితుల్లో సైతం దేశ సేవకోసం వీరు కూడా వారి భర్తల స్ఫూర్తిగా సైన్యం లో చేరడం

గమనార్హం. వీరిలో కొందరు అత్యున్నత హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారు. వీరు కూడా సరిహద్దుల్లో ఉగ్రమూకల అల్లర్లను ఎదుర్కొంటు ఎన్నో మార్లు మృత్యుముఖం నుంచి

బయటపడి,  à°¬à±à°²à±à°²à±†à°Ÿà±à°²à°¨à± సమర్ధవంతంగా ఎదుర్కొన్న ఘటనలూ ఉన్నాయి. ఇలాంటి వీర మహిళా సైనికాధికారులు, సైనికులు ఎందరో ఉన్నారు.  à°¨à±‡à°Ÿà°¿ యువతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్న

ఈ భారత మాటలందరికి యావత్ భారత దేశం పాదాక్రాంతం అవుతోంది. వీరిలో కొందరు వీరే. . .

షాలిని సింగ్, సుష్మిత పాండే, గరిమ అబ్రోల్, నీతా దేస్వాల్, స్వాతి మహాదిక్,

ప్రియా సెంవాల్ , గౌరి మహాదిక్, నిధి మిశ్రా, కనికా రాణే, సంగీత మాల్, నీరు సంబియల్, నైతిక  à°•à±Œà°²à± ఇలా ఎందరో భారత మాతలు ప్రస్తుతం దేశ రక్షణలో సేవలు అందిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam