DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా ముదురుతోంది. . ఎన్నికల కమిషనరూ  కళ్ళు తెరవండి.

ఎన్నికలు వాయిదా కు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు డిమాండ్.

మంత్రి పేర్ని నాని దాతృత్వానికి మాజీ ఎమ్మెల్యే విష్ణు కృతజ్ఞతలు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS ,

బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మార్చి 14 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వైరస్ కల్లోలం తో ప్రపంచ దేశాలే విలవిలలాడుతుంటే. .ఆంధ్రా లో ఎన్నికలు నిర్వహిస్తున్న ఎన్నికల

కమిషనర్ కళ్ళు మూసుకున్నారని, వెంటనే ఆయన కళ్ళు తెరవాలని జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేసారు. శనివారం బీజేపీ నగర కార్యాలయం లో జనసేన

బీజేపీ సంయుక్తంగా  à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚à°šà°¿à°¨ విలేకరుల సమావేశంలో విశాఖ నగరపాలక సంస్థకు పోటీ చేసే బిజెపి జనసేన ఉమ్మడి జాబితాను విడుదల చేశారు. à°ˆ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ 

కరోనా వైరస్ కల్లోలం తో ప్రపంచ దేశాలే విలవిలలాడుతుంటే. .ఆంధ్ర లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధపడడం పూర్తిగా ప్రజా

ద్రోహమేనన్నారు. ఆయన కళ్ళు మూసుకుపోయారని, ప్రపంచం ఎలా ఉందొ కళ్ళు తెరిచి చూడాలని, మూసుకున్నా చెవులను తెరిచి, ప్రజల ఆవేదన వినాలని డిమాండ్

చేసారు. 

సృష్టిస్తున్న తరుణం లో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్థానిక ఎన్నికలను తక్షణం వాయిదా వెయ్యాలని భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే

విష్ణుకుమార్ రాజు ఎన్నికల కమిషన్ ను డిమాండ్ చేసారు. ఈ తరుణంలో ఈ ఎన్నికలు నిర్వహించటం సబబా? అని ప్రశ్నించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కళ్లు తెరిచి

వాస్తవాలు గుర్తించి ఎన్నికల కారణంగా కరోనా విజృంభించకుండా చూడాలన్నారు. ఎన్నికలు వాయిదావేసి కరోనా తగ్గాక మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నారు. జనానికి కరోనా

వచ్చి చచ్చాక పరుగులు పెట్టి లాభం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రం నుంచి నిధులు రాకపోతే ఈ సమస్య వివరించి నిధులు తెచ్చుకోవచ్చన్నారు. విశాఖ లో కరోనా లేబరేటరీస్

పెట్టాలి. థియేటర్ లు మూసివేయాలి.

మంత్రి పేర్ని నాని à°•à°¿ . ..  à°•à±ƒà°¤à°œà±à°žà°¤à°²à± : . . .  

శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా లో పర్యటిస్తున్న రాష్ట్ర సమాచార శాఖామంత్రి

పేర్ని వెంకట్రామయ్య ( నాని ) మార్గమధ్యంలో చూపించిన దాతృత్వానికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ పట్నం కు చెందిన ఒక వ్యక్తి మాజీ

ఎమ్మెల్యే విష్ణు కు చెందిన ఒక పరిశ్రమ ఉద్యోగి కృష్ణ జిల్లా నిమ్మకూరు మార్గ మధ్యలో రోడ్ ప్రమాదంలో చిక్కుకుని స్పృహ తప్పి రోడ్డు పై పడిపోయారు. అదే సమయానికి

అదే రోడ్డు పై మంత్రి రావడం, తక్షణం తన కార్యదర్శిని కారు దింపి, ఆ గాయపడిన వ్యక్తిని కారులోకి ఎక్కించుకుని తగిన చికిత్స చేయించిన ఆరోగ్య మంత్రి కి ఈయన

ధన్యవాదాలు తెలియారు. పార్టీలు ఏవైనా, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మంచి స్ఫూర్తి అన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam