DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరు వారాల ఆర్ధిక భారం మొయ్యలేకే అభ్యర్థులు విదేశాలకు పలాయనం. .

ఎన్నికల వాయిదాతో పర్యాటక, విదేశాలకు అభ్యర్థులు. . .  *

*క్యాడర్ ను మొయ్యలేక తరుకుంటున్న పార్టీలు  à°•à°¾à°°à°£à°‚* 

*ఆర్ధిక భారం మొయ్యలేకే పలాయనం చిత్తగింపు .

.*

*రోజుకు 50 వేలకు పైగా ఖర్చు. . .మరింత భారం . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 16 , 2020 (డి ఎన్ ఎస్) : రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు

వాయిదా పడడంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు ఆర్ధిక భారం మొయ్యలేక విదేశాలకు పలాయనం చిత్తగిస్తున్నారు. ప్రచారానికి విరామం అని బయటకు చెప్తున్నప్పడికి

ప్రచారానికి వచ్చిన కార్యకర్తలను మేపలేకే విదేశాలకు అభ్యర్థులు పలాయనం చిత్తగిస్తున్నట్టు కొందరు అభ్యర్థులు బహిరంగంగానే చెప్తున్నారు. ప్రతి అభ్యర్థి వెనక

ప్రచారం చెయ్యడానికి కనీసం పది మంది కార్యకర్తలు ఉంటారు. విడిగా మరో నాలుగైదు బృందాల్లో కార్యకర్తలు మొత్తం వెరసి 50 మంది కార్యకర్తలను ప్రతి అభ్యర్థి మేపవలసిన

అవసరం ఉంది. కనీసం రోజు బేటా, ఉదయం, మధ్యాహ్నం ఆహార వసతి, దాహం తీర్చే ప్రక్రియ ఇలా రోజుకు ఒక్కో కార్యకర్తకూ రూ. 800 నుంచి రూ. 1000 వరకూ ఖర్చు ఉంటుంది. ఇలా ప్రతి

అభ్యర్ధికి అధమపక్షం రోజుకు రూ. 50 వేలు ఖర్చు పెట్టవలసిన అగత్యం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆరు వారాలు ఎన్నికలు వాయిదా వేస్తె. . అభ్యర్థుల ఖర్చు

ఠారెత్తిపోతుంది. అభ్యర్థులు ఇంత  à°–ర్చూ పెట్టినా అభ్యర్థి గెలుస్తాడన్న గ్యారంటీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖర్చు కొంత మిగిలినా మిగిలినట్టే అనే లెక్క లో

అభ్యర్థులు ఇతర రాష్ట్రాల్లోని పర్యాటక కేంద్రాలకు, విదేశాలకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.  

దాదాపుగా అన్ని స్థానాల్లోనూ ఏకగ్రీవం

చేసేందుకు అధికార పార్టీ విశ్వ ప్రయత్నం చేస్తున్నప్పడికి కొన్ని చోట్ల ప్రతిపక్షాలు జీవన్మరణ పోరాటం చేసి మరీ బరిలో నిలవడంతో ఎన్నిక తప్పని సరి కాబోతోంది.

దీంతో ఎన్నికలను నిర్వహించవలసిన భాద్యత ప్రభుత్వం పై పడడంతో బరిలో ఉన్న అన్ని పార్టీల అభ్యర్థులు తమ వెనక తిరిగే కార్యకర్తలను కచ్చితంగా మేపవలసిన పరిస్థితి

నెలకొంది. అధికార పార్టీ తమ అభ్యర్థులకు ఆర్ధిక భారం తగ్గించేందుకు ఎన్నికల ప్రక్రియ మొత్తం రెండు వారాల్లోగా ముగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. అయితే

మధ్యలో కరోనా వైరస్ రావడంతో అన్ని పార్టీల అభ్యర్థుల కొంప ముంచింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam