DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల రద్దు కై . . న్యాయ పోరాటం దిశగా పార్టీలు . . .?

*నామినేషన్ల పర్వంలో దౌర్జన్యాలు సాక్ష్యంగా చూపనున్న నేతలు* 

*తెలుగుదేశం తోలి అడుగు, ఆ వెనుకే బీజేపీ - జనసేన కూటమి. .*

*ప్రజాస్వామ్యం  కేవలం కాగితాలకే

పరిమితమైంది . .*
*బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కెవివి సత్యనారాయణ వెల్లడి.* *(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 16 , 2020 (డి

ఎన్ ఎస్) : రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న దౌర్జన్య కాండ నేపథ్యంలో స్థానిక ఎన్నికల రద్దుకై న్యాయ పోరాటం దిశగా రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్నట్టు

బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ కెవివి సత్యనారాయణ వెల్లడించారు. నామినేషన్ల దాఖలు సమయంలో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులపై జరిగిన దౌర్జన్యం, భౌతిక దాడులు,

బెదిరింపులను వివిధ ప్రసార మాధ్యమాల్లో ప్రసారమైన వీడియోలు, ఫోటోలను సాక్ష్యంగా చూపుతూ న్యాయస్థానం తలుపులు తట్టడానికి రంగం సిద్ధమైపోయింది. దీనికై తోలి

అడుగు తెలుగుదేశం పార్టీది కాగా, à°† వెనుకే భారతీయ జనతా పార్టీ-  à°œà°¨à°¸à±‡à°¨ కూటమిది కాబోవడం గమనార్హం. ఇప్పడికే ఏకగ్రీవం అయినట్టు ప్రకటించబడిన స్థానాల్లో దాదాపుగా

అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చెయ్యడం గమనార్హం. అయితే అధికార పార్టీ ప్రతినిధులతో, స్థానిక పొలిసు, ప్రభుత్వ అధికారులు కుమ్మక్కైన

కారణంగానే చాలా చోట్ల ప్రత్యర్థుల పోటీ గల్లంతు అయిందన్నారు. 

అయితే ప్రజాస్వామ్య దేశం అనేది కేవలం కాగితాలకే పరిమితమైందని సత్యనారాయణ మండిపడ్డారు.

ఎన్నికల బరిలో ఎవరికైనా పోటీ చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, అయితే అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాల ఫలితంగా రాజ్యాంగ హక్కులు కాలరాయిపోయాయన్నారు.

నామినేషన్ల సమయంలోనే పోటీ అభ్యర్థులపై దౌర్జన్యం చేస్తుంటే. . ఎన్నికల సమయంలో ఇక వీరిని సజీవంగా ఉంచే అవకాశం లేదని ప్రతిపక్ష పార్టీల్లో భయం నెలకొందన్నారు.

ఈక్రమం లోనే ప్రతిపక్ష పార్టీలకు న్యాయ పోరాటాం చెయ్యడం తప్ప మరొక మార్గం లేదన్నారు. 
ఇదిలా ఉంటె. . ఎన్నికల వాయిదాను ఛాలెంజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం

కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. 

ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావంతో ఆరు వారాలకు వాయిదా వెయ్యడం జరిగిందని, అయితే  à°‡à°‚తవరకూ జరిగిన నామినేషన్లు సజీవంగానే

ఉంటాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam