DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా నేపథ్యంలో సింహగిరి పై అన్నీ బంద్ - ఆంక్షలు. . 

*31 వరకూ కేశఖండన శాల, అన్నప్రసాద శాల మూసివేత. .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 19 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : కరోనా వైరస్‌ వ్యాప్తి

చెందకుండా తీసుకునే ముందస్తు చర్యల్లో భాగంగా సింహాచలం దేవస్థానంలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నట్లు కార్యనిర్వహణాధికారి ఎం.వెంకటేశ్వరరావు

తెలియచేస్తున్నారు. రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ఆదేశాల మేరకు à°ˆ ఆంక్షలు గురువారం నుంచి మార్చి 31à°µ వరకు అమలులో  à°‰à°‚టాయన్నారు.  à°ˆ నెల 19  à°®à°§à±à°¯à°¾à°¹à±à°¨à°‚ నుంచి మార్చి 31à°µ

తేదీ వరకు భక్తులు తలనీలాలు సమర్పించే కేశఖండనశాలను, స్వామివారి అన్నప్రసాద భవనం కూడా మూసివేయనున్నట్టు తెలిపారు. అయితే స్వామి ప్రసాదాన్ని భక్తులను పొంగలి,

దద్యోజనం వంటి ప్రసాదాలను పొట్లాల ద్వారా పంపిణీ చేయనున్నారు. 

ఇతర నియమాలు ఇవే : . . .

తలనీలాలు సమర్పించే కేశఖండనశాలను మూసివేయనున్నారు.  

స్వామివారి

అన్నప్రసాద భవనం కూడా మూసివేయనున్నారు.  

దేవాలయంలోకి భక్తులు ప్రవేశించే చోట చేతులు, కాళ్లు శుభ్ర పరచుకునేందుకు సబ్బు, శానిటైజర్లను అందుబాటులో

ఉంచారు. 

థర్మల్‌ గన్‌లతో భక్తుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించిన తర్వాతే దర్శనాలకు అనుమతించనున్నారు. 

ఎన్‌ఆర్‌ఐ, విదేశాల నుంచి వచ్చే భక్తులను 14

రోజులలోపు ఆలయంలోకి అనుమతించరు. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలున్న భక్తులను దేవాలయంలోకి అనుమతించరు.

దేవస్థానం ప్రాంగణంలో ఉమ్మి వేయడం, ముక్కు చీదడం

నిషేధించారు. 

ఆలయంలో జరిగే అన్ని ఆర్జిత సేవలను రద్దు చేశారు. 

ఉగాది, శ్రీరామనవమి వంటి ఉత్సవాల్లో సైతం భక్తులు సామూహికంగా పాల్గొనేందుకు అవకాశం

లేదు.

ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఉత్సవాలను తిలకించే అవకాశం కల్పిస్తారు.

ఆర్జిత సేవలు మినహా స్వామికి జరగాల్సిన సేవలు, నివేదనలు, పూజలు యథావిధిగా

జరుగుతాయి.  à°­à°•à±à°¤à±à°²à°•à± పాల్గొనే అవకాశం కల్పించరు.

దేవస్థానం సత్రాల్లో ప్రత్యేక పరిశుభ్రత చర్యలు అమలు చేయనున్నారు.

పై అంశాలతో పాటు సింహాచలం

దేవస్థానంలో తీసుకోవాల్సిన ఇతర కరోనా నియంత్రణ చర్యలపై ఆలయ అధికారులు, వైదికులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈవో తెలిపారు.

60 ఏళ్ళు దాటిన వృద్ధులు,

10ఏళ్లలోపు పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు, దివ్యాంగులు ఆలయ సందర్శనను వాయిదా వేసుకోవాలని ఈవో కోరారు.

సింహగిరిపై పవిత్ర గంగధార, కొండ దిగువన పుష్కరిణి

చెరువులో à°­à°•à±à°¤à±à°²à°¨à± సామూహిక పుణ్య స్నానాలకు అనుమతించరు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam