DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత్స్యకార ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ : కలెక్టర్ నివాస్ 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 19, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : శ్రీకాకుళం జిల్లాలో కరోనా వైరస్ ( కోవిడ్ – 19 ) ప్రబలకుండా ఉండేందుకు ప్రత్యేక

చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ జె.నివాస్ చెప్పారు.   గురువారం ఉదయం జిల్లా రెడ్ క్రాస్ సంస్థ మెడిసన్ బ్యాంకులో ఏర్పాటుచేసిన ఫిజియోథెరఫి నూతన

పరికరాలను కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు అన్ని విద్యాసంస్థలకు  à°¸à±†à°²à°µà±à°²à°¨à±

ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందని, అందులో భాగంగా జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, శ్వవిద్యాలయాలకు బుధవారం నుండి సెలవులను

ప్రకటించామని చెప్పారు. జిల్లాలో ఎవరైతే విదేశాల నుండి వచ్చిన వారు ఉన్నారో అటువంటి వారిని వాలంటీర్లు, ఆశావర్కర్లు ద్వారా గుర్తించి ప్రత్యేక చర్యలు

తీసుకుంటున్నట్లు చెప్పారు. విదేశాల నుండి వచ్చిన వారిలో ఇప్పటివరకు భారత ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం 217 మంది, మన సర్వే ద్వారా తేలిన 289 మంది ఈ రెండింటిని

కలుపుకుంటూ,  à°à°¸à±‹à°²à±‡à°·à°¨à±à°²à±‹ ఉండాల్సిన వారు 262 మందిగా  à°—ుర్తించామని అన్నారు. వీరికి అధికార పూర్వకంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధివారి ద్వారా నోటీసును

జారీచేసామని, వీరు ఎట్టి పరిస్థితిల్లోనూ ఆరుబయట తిరగడానికి వీల్లేదని కలెక్టర్ పేర్కొన్నారు. వీరంతా తమ ఇంట్లోనే 14 రోజుల పాటు ఒక గదిలో కట్టుబడి ఉండాలని

తెలియజేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదేరకంగా నగరపాలక సంస్థ మరియు పురపాలక సంఘాల కమీషనర్లతో సమావేశాన్ని ఏర్పాటుచేసామని, వారి పరిధిలో గల హోటళ్లు,

రెస్టారెంట్లలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలు కూర్చేనే టేబుళ్లు, కుర్చీలను ఎప్పటికపుడు శుభ్రపరుస్తూ ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం

జరిగిందని అన్నారు.  à°ªà°°à°¿à°¶à±à°­à±à°°à°¤ పాటించని బేకరీలు, హోటళ్లు, రెస్టారెంట్లను వెంటనే మూసివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.  à°‡à°¦à°¿ కేవలం హోటళ్లు, రెస్టారెంట్లకే

పరిమితం కాదని, ప్రజలు ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాలకు వర్తిస్తుందని చెప్పారు. కరోనా వైరస్ నియంత్రణ కోసం జిల్లాలో ఐసోలేషన్ వార్డులను టెక్కలి ఏరియా ఆసుపత్రి

మరియు శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటుచేసామన్నారు. అదేవిధంగా ప్రతీ ప్రైవేటు ఆసుపత్రులలో 50 పడకలను ఐసోలేషన్ కొరకు సిద్ధం చేసి ఉంచామని అన్నారు.

ఇప్పటివరకు జిల్లాలో సందేహంగా ఉన్న ముగ్గురి శాంపిల్స్ ను పంపడం జరిగిందని, అవన్నీ నెగిటివ్ అని తేలిందని చెప్పారు. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదని, జిల్లా

యంత్రాంగం అప్రమత్తంగా ఉందని కలెక్టర్ స్పష్టం చేసారు. ఇవేకాకుండా జిల్లాలోని మత్స్యకార గ్రామాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని చెప్పారు. సీమెన్ గా,

పోర్టులలో పనిచేస్తూ విదేశాల నుండి వచ్చిన వారి డేటాలను సేకరించడం జరిగిందని, దీనిపై సమావేశాన్ని ఏర్పాటుచేసామని చెప్పారు. వారిని కూడా ప్రత్యేకంగా ఉంచి

నివారణకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేసారు. సినిమా థియేటర్లు, కేబుల్ నెట్ వర్కుల ద్వారా ప్రచార వీడియోలను వేసి ప్రజలను అప్రమత్తం

చేస్తున్నామని, జిల్లా నుండి కూడా ఒక ప్రచార వీడియోను తయారుచేస్తున్నామని తద్వారా ప్రజలను మరింత అప్రమత్తం చేసేందుకు ప్రచారాన్ని చేపడుతున్నట్లు కలెక్టర్

చెప్పారు. జిల్లాలో కోవిడ్-19 కొరకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని, మీడియాకు ఎప్పటికపుడు జిల్లా యంత్రాంగం చేపట్టే చర్యలపై సమాచారాన్ని అందజేస్తామని

కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలోని కొన్ని సినిమా థియేటర్లు స్వచ్ఛంధంగా మూసివేస్తున్నారనే మీడియా ప్రతినిధులు లేవనెత్తిన అంశంపై కలెక్టర్ మాట్లాడుతూ

ఇటువంటి చర్యలు హర్షనీయమన్నారు. ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఒకటి సినిమా థియేటర్లు అని అటువంటి వాటిని స్వచ్ఛంధంగా మూసివేసేందుకు ముందుకువచ్చే

యాజమాన్యాలను స్వాగతిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. à°ˆ విధమైన చర్యలు తీసుకోవడం చాలా మంచి పరిణామమని చెప్పారు.    à°ˆ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ సంస్థ

ఛైర్మన్ పి.జగన్మోహనరావు, ఫిజియోథెరఫీ పరికరాల దాత సి.పద్మావతి, మధుమేహ వైద్య నిపుణులు  à°¡à°¾. కెల్లి చిన్నబాబు, ఫిజియోథెరఫిస్ట్ à°¡à°¾. లక్ష్మణమూర్తి, రెడ్ క్రాస్

సభ్యులు బలివాడ మల్లేశ్వరరావు, నిక్కు హరి సత్యనారాయణ, రెడ్ క్రాస్ సిబ్బంది   కె.సత్యనారాయణ, బి.సతీష్, బి.శ్రీధర్, విజయ్, ఉమా తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam