DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రానున్న ఎన్నికల్లో విశాఖలో విజయ ఢంకా మ్రోగిస్తాం : వై ఎస్ ఆర్ నేత ఎంవి వి 

విశాఖపట్నం, జూన్ 30 , 2018 (DNS Online ) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖపట్నం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఒక లోక్ సభ, ఏడూ శాసన సభా స్థానాల్లో విజయఢంకా

మ్రోగిస్తామని వైఎస్ ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నం పార్లమెంటరీ నియోజక సమన్వయ కర్త ఎం. వివి సత్యనారాయణ ప్రకటించారు. శనివారం నగరంలోని మద్దిలపాలెం లో గల నగర పార్టీ

కార్యాలయంలో పార్టీ నియోజక వర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా

పోరాట దీక్ష, పాదయాత్రలకు, అయన ప్రకటించిన నవ రత్నాల సాధన పట్ల అరకర్షితులై అయన సమక్షంలోనే పార్టీలో చేరినట్టు తెలిపారు. పారిశ్రామిక వేత్తగా మహా విశాఖనగరం లోని

స్థితిగతులు, పరిస్థితుల పట్ల పూర్తి అవగాహన ఉందన్నారు. తన సామర్ధ్యం గ్రహించి, తనకి అప్పగించిన ఈ భాద్యతలను సద్వినియోగం చేసుకుని, దాదాపు అన్ని స్థానాల్లోనూ

విజయఢంకా మ్రోగించేలా కృషి చేస్తానని తెలిపారు. 

నగర కమిటీ అధ్యక్షులు మళ్ల విజయ ప్రసాద్ మాట్లాడుతూ గత ఎన్నికల్లో విశాఖ ప్రజలు తాము చేసిన తప్పు

గ్రహించారని, ఆ తప్పుని రానున్న ఎన్నికల్లో సరిదిద్దుకుంటారన్నారు. ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తామంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ఆర్భాట ప్రచారాలకు మోసపోయిన ప్రజలు

గత నాలుగేళ్ల కాలం లో ఘోరంగా దెబ్బతిన్నారన్నారు. రాష్ట్రం లోని అన్ని ప్రభుత్వ శాఖలూ అవినీతి మయంగా మారిపోయాయని, ఏ పని కావాలన్నా ముడుపులు చెల్లించుకోవాల్సి

అగత్యం పట్టిందని తెలిపారు. మహిళలకు తగిన భద్రతా లేకుండా పోయిందని, అవినీతిని, భూ ఆక్రమణలను నిలదీసిన వారిపై భౌతిక దాడులు జరుగుతున్నారన్నారు. వీటన్నింటికీ మరి

కొన్ని రోజుల్లో ముగింపు తెర పడుతుందన్నారు. రానున్నది రాజన్న రాజ్యమని, సామాన్యులకు అందుబాటు లో ఉండేల పాలన సాగుతుందని వివరించారు. 
ఈ సమావేశం లో పార్టీ నేతలు

తైనాల విజయ కుమార్, విశాఖ ఉత్తర నియోజక వర్గ సమన్వయ కర్త కేకే రాజు, నగర మహిళా అధ్యక్షురాలు గారికిన గౌరీ, ఇతర అనుబంధ సంఘాల ప్రతినిధులు, వివిధ వార్డుల నాయకులూ,

కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనన్నారు. 

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam