DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరుణుని అనుగ్రహం కోసం అరసవల్లి ఆలయంలో అరుణ హోమం

*మానవాళి రక్షణ కోసం అరసవల్లి ఆలయంలో ఆరాధనలు* 

*సూర్య నమస్కారాలు, మహా సౌరం, త్రిచ, అరుణం హోమం ఆరంభం* 

*ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి : అర్చకులు శంకర

శర్మ* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 22, 2020 (డి ఎన్ ఎస్) : సమస్త మానవాళి శ్రేయస్సు కాంక్షిస్తూ, కరోనా వైరస్ మహమ్మారి

వ్యాప్తి చెందకుండా ఉండేందుకు శ్రీకాకుళం జిల్లా అరసవల్లి లోని శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో మహా సౌరం, త్రిచ, అరుణం ఆధారంగా యజ్ఞ యాగాదులు

నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం ఆలయంలో ఆరాధనలు నిర్వహించిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు కుప్పిలి శంకర శర్మ నేతృత్వం లో ని అర్చక బృందం మహా సౌరం, త్రిచ, అరుణం

మూడు ఉపనిషత్తులలో సూర్య నమస్కారాలు, మహా సౌర, అరుణ హోమం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి.

à°ˆ సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయ  à°ªà±à°°à°§à°¾à°¨

అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ సమస్త భూ మండలాన్ని పరిరక్షించే ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి అనుగ్రహం కోరుతూ, à°ˆ కరోనా మహమ్మారి  à°ªà±à°°à°¬à°²à°•à±à°‚à°¡à°¾

ఉండే విధంగా రక్షించమని స్వామిని ప్రార్ధిస్తూ మహా సౌరం, త్రిచ, అరుణం మూడు ఉపనిషత్తులలో సూర్య నమస్కారాలు, మహా సౌర, అరుణ హోమం ప్రత్యేక పూజలు చేస్తున్నామన్నారు.

ప్రజలందరూ తమ తమ ఇళ్లలోనే ఉండి స్వామి అనుగ్రహం కోసం ఆదిత్య హృదయ పారాయణ చేపట్టవలసిందిగా సూచించారు. 

సహాయ కమిషనర్ మరియు ఆలయ కార్యనిర్వాహణాధికారి వి హరి

సూర్య ప్రకాష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం సూర్య దేవాలయంలో హైందవ సంప్రదాయ ప్రకారం హోమాలను చేపడుతున్నామన్నారు. ఈ సమయంలో కేవలం దేవాలయం

అర్చకులు మరియు వైదిక సిబ్బందికి మాత్రమే పాల్గొంటారు.. ఇతరులు ఎవ్వరికి ప్రవేశం లేదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam