DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశం మొత్తం ధన్యవాదం చెప్పింది ఇలాంటి వాళ్ళకే. .. 

*అత్యంత ప్రమాదకరమైనా సేవ వీళ్లదే . . . .*

*వైరస్ రోగులకు వైద్యం అందిస్తున్న వీరు మహనీయులే. . .* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం,

మార్చి 22 , 2020 (డి ఎన్ ఎస్) : ప్రపంచాన్ని వొణికిస్తున్న కరోనా వైరస్ పై పోరాటం చేసేందుకు ఎందరు ఎన్ని చర్యలు తీసుకున్న. . . ప్రత్యక్షం గా ప్రమాదాన్ని ఏంటో ధైర్యంగా

ఎదుర్కొనే వారిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది ఉంటారు. ప్రస్తుతం వీరు చేస్తున్న సేవలకు ఎవ్వరూ విలువ లెక్కించలేరు. ప్రజలకు రక్షణ కల్పించేందుకు మునిసిపల్

పారిశుధ్య విభాగం వ్యాధిగ్రస్తుల ఇల్లు, నివాసాల పరిసరాలలో రక్షణా సేవలు అందిస్తుంటే. . . వైద్య విభాగం నేరుగా వ్యాధి గ్రస్తులకే సేవ లు అందిస్తున్నారు. ఏమాత్రం

అజాగ్రత్తగా ఉన్నా ఫలితం చాలా ప్రమాదకరంగా ఉంటుందని తెలిసి కూడా వైద్య సిబ్బంది, వారికి సహకరిస్తున్న నర్సింగ్ విభాగం సిబ్బంది, ఆశా వర్కర్లు,. . .ఇలా వైద్య

రంగానికి చెందిన లక్షలాది మంది గత కొన్ని వారాలుగా ప్రత్యక్షంగా పోరాటం చేస్తున్నారు. వీరిలో చిన్న వయసు కల్గిన యువతీ యువకులు, మధ్య వయస్కులు, వృద్ధులు కూడ

రాత్రనక, పగలనక సేవలు అందిస్తున్నారు. వీరి మానసిక ధైర్యానికి ప్రతి ఒక్క భారతీయుడు అండగా నిలబడవలసి అవసరం ఉంది. ప్రజలందరికి ఒక సందేశాన్ని ఇస్తూ కొందరు

వైద్యవిభాగం సిబ్బంది వీడియో విడుదల చేసారు. దానిలో ప్రజలు పాటించవలసిన సూచనలను 6 ప్ల కార్డుల ద్వారా ప్రదర్శించారు. వీటిని ప్రతి ఒక్క భారతీయుడు తప్పని సరిగా

పాటించవలసినవి. 

1  à°®à°¾à°•à± కూడా కుటుంబాలు ఉన్నాయి.  à°…యినా కూడా మేము ఇంటివద్ద ఉండే అవకాశం లేదు. 

2   మాకు సెలవలు ఉండవు, లేవు, తీసుకునే అవకాశం లేదు.

3

సమాజం పట్ల మీ వంతు భాద్యతగా మీ ఇళ్ల వద్దే ఉండండి.  à°† అవకాశం మాకు లేదు. 

4 చేతులు శుభ్రంగా కడుక్కోండి.

5  à°®à±€ శ్రేయస్సు కోసం, రక్షణ కోసం మేము ప్రమాద

పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నాం.

6  à°®à°¾ సూచనలు పాటించండి. .  à°®à±‡à°®à± మీ రక్షణ భాద్యత తీసుకుంటాం. 

ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికీ వైద్య సిబ్బంది,

నర్శింగ్ సిబ్బంది చేస్తున్న సేవలపై మరింత గౌరవం తప్పక పెరుగుతుంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam