DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హయ్యమ్మ. . 35 గంటల తర్వాత రైతు బజార్ తెరిచారు

*సోమవారం ఉదయం నుంచి నగర వాసుల రాక. .*

*ప్రభుత్వ సూచనలు ఎక్కడా అనౌన్స్ చెయ్యడం లేదు*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 23 , 2020

(డి ఎన్ ఎస్) : దాదాపుగా 35 గంటల తర్వాత రైతు బజార్ లు, ఇతర అత్యవసర దుకాణాలు తెరవడం తో నగర వాసులు ఊపిరి పీల్చుకున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ని కంటోల్ చేసేందుకు

భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ భారత దేశ ప్రజలూ ఆదివారం (మార్చి 22 న) స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శనివారం రాత్రి

నుంచే రైతు బజార్ లు మూసుకు పోయాయి. జనతా కర్ఫ్యూ అనంతరం సోమవారం ఉదయం రైతు బజార్ లు తెరవడం తో నగర ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఈ నెలాఖరు వరకూ దేశ వ్యాప్తంగా

లాక్ డౌన్ ప్రకటించడంతో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియక సతమతమవుతున్న తరుణంలో సోమవారం ఉదయం కొంత వెసులు బాటు కల్పించడంతో పాలు, కూరలు కొనుక్కునే అవకాశం

లభించింది. ఇంటికి ఒకరు చొప్పున బయటకు వచ్చి నిత్యావసర సరుకులు కొనుక్కోవచ్చు అనే నిబంధన అమలు లో ఉంది. 

రైతు బజార్ లో  à°ªà±à°°à°­à±à°¤à±à°µ సూచనలు అనౌన్స్ మెంట్  à°²à±‡à°¦à±. .

.

కరోనా మహమ్మారి విస్తరించకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిబంధనల మేరకు జనం ఐదుగురికి మించి ఎక్కడా నిలిచి ఉండకూడదు. ప్రతి మనిషి మరొకరికి కనీసం మీటరు

దూరంలో ఉండాలి. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ప్రక్కవారికి ఇబ్బంది కలుగకుండా ఉండాలి అనే నిబంధనలు తెలియచేసింది. వీటిని ప్రతి చోటా నగర వీధుల్లో అనౌన్స్మెంట్

చెయ్యవలసి ఉంది. 

అయితే విశాఖ పట్నం లోని రైతు బజార్ లలో ఎక్కడా à°ˆ ముందస్తు జాగ్రత్తల  à°…నౌన్స్మెంట్ వినిపించలేదు. పైగా  à°¸à±€à°¤à°®à±à°®à°§à°¾à°° రైతు బజార్ లో à°ˆ నిబంధనలు

ఎక్కడా అమలు కాలేదు. జనం సాధారణంగానే తిరుగుతున్నారు. ఒకే చోట పది మంది కి పైగా కూడి కూరలు కొనడం వంటివి కనిపించాయి. ముఖానికి మాస్క్ లు వేసుకున్న వారు

తక్కువగానే కనిపించారు.  
రైతు బజార్ లోని ఎస్టేట్ మేనేజర్ ఆఫీస్ నుంచి  à°•à±‚రలు కొనడానికి వచ్చిన ప్రజలకు ఎటువంటి సూచనలు మైక్ లో చెప్పబడలేదు. వినియోగ దారులు

కూడా ఇవేవీ తమకు పట్టవు అన్నట్టుగానే కనిపించారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam