DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వీళ్ళను చూసైనా కళ్ళు తెరవాల్సిన భాద్యత ప్రజలపై ఉంది 

*వేలాది మంది వైద్య సిబ్బంది కంటి పై కునుకు లేకుండా సేవ .*

*దేశ ప్రజల రక్షణకై అవిశ్రాంత పోరాటం చేస్తున్నారు. . . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, మార్చి 23 , 2020 (డి ఎన్ ఎస్) : వేలాది మంది వైద్యులు, వైద్య సహాయకులు, పారామెడికల్, ఆశ వర్కర్లు, మునిసిపల్ కార్మికులు ఇలా లక్షలాదిగా సిబ్బంది కంటి మీద

కునుకు లేకుండా కరోనా పాజిటివ్ లకు చికిత్సలు అందిస్తున్నారు. కనీసం వీరికి నిద్రపోయే సమయం కూడా లభించడం లేదు అంటే ఈ వైరస్ తీవ్రత భారత దేశంలో ఎలా ఉందొ అర్ధం

చేసుకోవచ్చు.  à°°à±‹à°œà±à°²à±‹ పడుకుని విశ్రాంతి పొందడానికి à°’à°• à°—à°‚à°Ÿ సమయం కూడా లభించడం లేదంటే ఆశ్చర్యం కలుగక మానదు. పడుకునే సమయం లభించక వారు విధుల్లో ఉన్నచోటే

నేలపైనే ఒక అరగంట విశ్రాంతి తీసుకుని మళ్ళీ విధుల్లోకి వెళ్లిపోతున్నారు. వీరు చేస్తున్న సేవలకు మొత్తం దేశ ప్రజలంతా రుణపడిపోయారు అంటే అతిశయోక్తి కాదేమో.

 à°‡à°‚à°¤ కఠోర శ్రమతో ప్రజా ఆరోగ్యం కోసం వీరు దాదాపుగా యుద్ధమే చేస్తున్నారని చెప్పాలి. వీరికి దేశ ప్రజలు చెయ్యవలసిన కృతజ్ఞతా ఏంటి?

తిండి తిప్పలు లేకుండా . .

తమ ఇండ్లూ వాకిళ్ళు వదిలేసి, కుటుంబాలకు దూరంగా ఉంటూ, అన్నపానాదులు, సరైన నిద్ర కూడా లేకుండా....అవకాశం చిక్కినపుడు  à°Žà°•à±à°•à°¡ స్థలం దొరికితే అక్కడ 5, 10

నిమిషాలపాటు సేదతీరుతూ. . . .  à°•à°°à±‹à°¨à°¾ సోకినవారికి నిరంతర సేవలనందిస్తున్న వైద్యులు, నర్సులు, కంపౌండర్లు,  à°µà°¾à°°à±à°¡à±à°¬à°¾à°¯à± లు మొదలైనవారు. 

వీరి సేవాభావం

అనిర్వచనీయం. సమాజక్షేమం కొరకు ఇంతగా శ్రమిస్తున్న వీరి స్ఫూర్తితో మనమందరం ప్రభుత్వం ఇచ్చిన సూచనలను పాటిస్తూ 31 మార్చి వరకు ఇంట్లోనే ఉందాం....కరోనా మహమ్మారిని

తరిమి కొడదాం, సమాజాన్ని, దేశాన్ని రక్షించుకుందాం.

ప్రజలు చెయ్యవలసింది ఏంటి ? . . . 

ఈ కరోనా వైరస్ బారిన పడకుండా కేవలం ఇంటి దగ్గర మాత్రమే ఉండడం. కనీసం ఇది

కూడా ప్రజలు చెయ్యలేక పొతే ఇలాంటి లక్షలాది మంది వైద్య బృందాలు పడుతున్న కష్టం పూర్తిగా వృధా అయిపోతుంది. ఇలాంటి పోరాట యోధుల పోరాటం విజయం సాధించడానికి దేశ

ప్రజల సహకారం అవసరం. వీరు అకారణంగా రోడ్లపైకి వచ్చి, ఆ వైరస్ వ్యాప్తి చెందడానికి సాధకులు కాకూడదు అనే దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. అయితే దేశ

ప్రజలు మాత్రం దీన్ని ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా రోడ్లపైకి గుంపులు గుంపులుగా వచ్చేస్తున్నారు. 

Note: . . .

వీళ్ళను చూసైనా దేశ ప్రజలు కళ్ళు తెరవక పొతే

క్షమించమని అడిగే అర్హత కూడా కోల్పోతారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam