DNS Media | Latest News, Breaking News And Update In Telugu

21 రోజుల పాటు ఢిల్లీ నుంచి గల్లీ దాకా దేశం పూర్తి గా లాక్ డౌన్

నేటి అర్ధరాత్రి నుంచి పూర్తి స్థాయి ఆంక్షలు అమలు లోకే . .*

*కరోనా పై కఠిన చర్యలు తప్పదు, పౌరులు పాటించాల్సిందే.*

*మనం చేసేది జీవన్మరణ పోరాటం.

సహకరించాల్సిందే. . .* 

*సామాజిక దూరం ప్రధాని నుంచి. . సామాన్యుని వరకూ...*

à°• : కోయి, రో : రోడ్ పర్, నా : à°¨ నికలే : మోడీ నినాదం 

*భారత ప్రధాని నరేంద్ర మోడీ సంచలన

ప్రకటన* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 23 , 2020 (డిఎన్ఎస్) : మంగళవారం అర్ధరాత్రి 12 à°—à°‚à°Ÿà°² తర్వాత  à°¢à°¿à°²à±à°²à±€ నుంచి గ్రామాల్లోని

గల్లీల వరకూ దేశం మొత్తం పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్టు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సంచలన ప్రకటన చేసారు. మంగళ వారం సాయంత్రం దేశ ప్రజలనుద్దేశించి చేసిన

ప్రసంగంలో చాలా ఉద్వేగంగా ప్రసంగించారు. ప్రస్తుతం దేశం మొత్తం అత్యంత ప్రమాద కర విపత్తును ఎదుర్కోనుంది, దీన్ని కచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు జయించి

తీరాలన్నారు.  à°°à°¾à°¨à±à°¨à±à°¨ 21 రోజుల పాటు à°ˆ దేశవ్యాప్త లాక్ డౌన్ కచ్చితంగా అమలు లో ఉంటుందన్నారు.  à°ªà±à°°à°¤à°¿ ఒక్క భారతీయుడు తమ ఇంటికే పరిమితం కావాలన్నారు. ఇంటి ముందు

లక్ష్మణ రేఖ గీసుకుని, బయటకు రాకూడని హెచ్చరించారు.  ఇది ప్రతి ఒక్క భారతీయునికి జీవన్మరణ పోరాటమేనన్నారు. దీన్ని కచ్చితంగా

సహకరించాల్సిందేన్నారు. 

ప్రజా సేవకులకు సహకరించండి. . :

వేలాది మంది వైద్యులు, వైద్య సహాయకులు, పారామెడికల్ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, అధికారులు,

పోలీసులు, మీడియా ప్రతినిధులు, ఇలా దేశ వ్యాప్తంగా తమ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా వ్యాధి గ్రస్తుల ప్రాణాలు కాపాడేందుకు శ్రమిస్తున్నారు. వారందరికీ సహకరించడం

ప్రతి ఒక్క భారతీయుని భాద్యత. 

ప్రధాని సూచించిన అంశాలలో కీలకం :

ఇది à°’à°• విధమైన కర్ఫ్యూ లాంటిదేనన్నారు, 

పైగా జనతా కర్ఫ్యూ కంటే కఠినమైన కర్ఫ్యూ

అన్నారు.

ఇల్లు విడిచి బయటకు రావడం పూర్తిగా నిషేధం

ప్రతీ నగరం,ప్రతీ ఊరు,ప్రతీ వీధి లాక్డౌన్ లోకి వెళ్లాల్సిందే

వచ్చే 21 రోజుల పాటు ఈ నిర్బంధం

అమలులో ఉంటుంది

కరోనా మహమ్మరిని జయించాలంటే ఈ స్వీయ నిబంధన తప్పదు.

లేకుంటే దేశం..మీ కుటుంబం 21 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోతుంది

మీ ఇంటి గుమ్మం ముందు ఒక

లక్ష్మణ రేఖ గీయండి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam