DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టైం దాటి రోడ్లపై కనిపిస్తే కాల్చివేత తప్పదు. . .: కె సి ఆర్

*లాక్ డౌన్  . .కాదంటే. . లాఠీ ఆన్ . . .* 

*లాక్ డౌన్ సమయంలో కఠిన చర్యలు తప్పవు. .*

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 24, 2020 (à°¡à°¿

ఎన్ ఎస్) : కరోనా ను పూర్తిగా నియంత్రించేందుకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిందని, ప్రతి ఒక్కరూ కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందేనని, లేదంటే కనిపిస్తే

కాల్చివేతే అమలవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలిపారు. అత్యవసర ఆరోగ్య పరిస్థితులు అమలవుతున్నాయని, లాక్‌డౌన్‌ నిబంధనలను పాటించకుండా

రోడ్లపైకి వచ్చిన వారిని కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అన్నారు. ప్రజలు సహకరించకుంటే షూట్‌ ఎట్ సైట్ ఆర్డర్స్‌ ( కనిపిస్తే కాల్చివేత )

ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. పోలీసులకు సహకరించకుండా.. ఆర్మీని రంగంలోకి దించే పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

రాష్ట్రంలో

కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన చర్యలు, లాక్‌డౌన్‌ పరిస్థితులపై సీఎం కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ. . అగ్రరాజ్యమైన అమెరికాలో స్థానిక పోలీసులు కంట్రోల్ చేయలేక ఆర్మీని పిలిపించారని, రాష్ట్రంలో ప్రజలు సహకరించకపోతే 24 గంటల

కర్ఫ్యూ పెట్టాల్సి ఉంటుందని కేసీఆర్ స్పష్టం చేశారు. 

సీఎం కేసీఆర్‌ ఇంకా ఏమన్నారంటే..

గ్రామపంచాయతిలో స్టాండింగ్ కమిటీ లు రంగంలోకి దిగాలి..
ఏ ఉరి

సర్పంచ్ ఆ ఊరికి కథానాయకుడు కావాలి..
ప్రతి నియోజక వర్గంలో MLA లు అందుబాటులో ఉండాలి.
ప్రతి చెక్ పోస్ట్ దగ్గర ప్రజాప్రతినిధులు ఉండాలి.
ఎమర్జెన్సీ ఉంటే 100 కు కాల్

చేయండి.
నిత్యావసర ధరలు పెంచితే,కూరగాయల ధరలు పెంచితే పీడీ యాక్ట్ పెట్టి కేస్ లు పెట్టిస్తాం..
రైతులు ఎట్టిపరిస్థితుల్లో మార్కెట్ కి రావొద్దు.
/> వరి,మొక్కజొన్న ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.
మాట వినకపోతే..బయట కనిపిస్తే కాల్చివేత.
సాయంత్రం 6:00 నుండి ఉదయం 6:00 వరకు పూర్తి గా కర్ఫ్య్ ఉంటుంది.
అన్ని

షాపులు సా.6:00 గం. లకు మూసివేయాలి..
నిబంధనలు ఉల్లంగిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam