DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత తరహా సంతలను తలపిస్తున్న మార్కెట్ లు

*విశాలమైన మైదానాల్లోకి మారిన రైతు బజార్లు,* 

*రక్షక భటులా రక్షణలో. . .సంతల్లాంటి మార్కెట్లు* 

 

*సామాజిక దూరం అంటే ఇదే  . . .* 

*హర్షం వ్యక్తం

చేస్తున్న ప్రజానీకం. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 25 , 2020 (డిఎన్ఎస్) : విశాఖ నగరం లో కొత్తగా మార్చిన మైదానాలలో రైతు బజార్లను

చూస్తే పాత కాలంలో గ్రామాల్లో ఉండే సంతాలను తలపిస్తున్నాయి.  à°¸à°¾à°®à°¾à°œà°¿à°• దూరం పాటించడం కోసం రైతు బజార్ లను, మార్కెట్ లను ప్రస్తుతం ఉన్న ఇరుకు ప్రాంతాల నుంచి

విశాలమైన మైదాన ప్రాంతాల్లోకి మార్చడం పట్ల ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో దుకాణాన్ని దూరం దూరంగా పెట్టడంతో వినియోగదారులకు సైతం అనువుగా

ఉండనే అభిప్రాయాలను నగర వాసులు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం వరకూ ఉన్న రైతు బజార్లు ఇరుకుగా దగ్గర దగ్గరగా ఉండడంతో అక్కడకు ప్రజలు వస్తే చాలా సమస్యలు

తలెత్తే అవకాశం ఉన్నందున రాష్ట్ర ప్రభుత్వం వాటిని విశాల మైదానాల్లోకి మార్చాలి అని నిర్ణయించింది. దీంతో విశాఖ నగర, జిల్లా పరిధిలోని అన్ని రైతు బజార్లను సమీపం

లోని మైదాన ప్రాంతాల్లోకి మార్చారు. విశాఖ నగరం లోని సీతమ్మధారలో గల రైతు బజార్ ను సమీపంలోని హెచ్ బి కోలనీ లో గల ఉక్కు కళామందిరం మైదానంలోకి మార్చారు. పూర్తిగా

విశాలంగా ఉండే ఈ ప్రాంగణంలో ఏర్పాటు చెయ్యడం ద్వారా ప్రజలు కనీస దూరం పాటించే అవకాశం ఉంది. పైగా పోలీసు విభాగం సిబ్బంది నిరంతర పర్యవేక్షణలో ఉన్నందున,

వినియోగదారులను ఎక్కువ సమయం అక్కడ ఉండనివ్వడం లేదు,  à°•à±‚రగాయలు కొన్న వెంటనే à°† ప్రాంగణం ఖాళీ చెయ్యాలంటూ సూచనలు చేస్తున్నారు. ఇద్దరు, ముగ్గురిని కలిసి

ఉండనివ్వడం లేదు. à°ˆ ప్రక్రియ నిరంతరం సాగుతుందని తెలుస్తోంది. ఇదే విధంగా నగరం, జిల్లాలోని ఇతర రైతు బజార్లను కూడా విశాల మైదానాల్లోకి మార్చారు. 

సామాజిక

దూరం అంటే ఇదే:   . . . 

వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ సామాజిక దూరం తప్పకుండా పాటించాలి అనే ప్రధానమంత్రి సూచనల మేరకు నిత్యావసరాల వస్తువులు విక్రయించే

ఒక వ్యాపారి. . బియ్యం అమ్మకాలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. ఖాతాదారులకు నేరుగా వస్తువులు ఇవ్వకుండా పొడవాటి గొట్టం లాంటి పరికరాన్ని ఏర్పాటు చేసి, దాని నుంచి

బియ్యం, ఇతర సామాగ్రి ఖాతాదారులకు అందిస్తున్నారు. à°ˆ విధమైన విధానం అందరినీ ఆకర్షిస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam