DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆదర్శవంతంగా రాష్ట్రం లో నిత్యావసరాల విక్రయాలు 

*సామాజిక దూరం  à°¦à±‡à°¶à°¾à°¨à°¿à°•à±‡ మార్గదర్శం. ప్రజల హర్షం,*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 25, 2020 (డి ఎన్ ఎస్) : ప్రజలు నిత్యావసరాలు

కొనుగోలు చేసేందుకు సామాజిక దూరం పాటించే విధంగా శ్రీకాకుళం అధికారులు చేసిన ఏర్పాట్లు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువవుతున్నాయి.  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా

కలెక్టర్ డాక్టర్ నివాస్, ఎస్పీ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి లు సూచించిన మార్గదర్శకాల మేరకు ఒక్కో వినియోగదారునికి దూరం ఉండే విధంగా à°…ందరూ స్వచ్చందంగా సామాజిక దూరం

పాటించేలా ఏర్పాట్లు చేసారు. బుధవారం నుంచి రైతు బజార్లు, ఇతర మార్కెట్లను విశాల ప్రాంగణాల్లోకి మార్చడంతో పాటు, ఒక్కో దుకాణం ముందు పోలీసు సిబ్బంది, ఇతర

మార్కెటింగ్ సిబ్బంది à°ˆ విషయం లో చాలా నిబద్దత తో పని చేస్తున్నారు. 
జిల్లాలోని ప్రజలకు నిత్యావసర సరకులు, కూరగాయలు  à°‰à°¦à°¯à°‚ ఆరు à°—à°‚à°Ÿà°² నుండి మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ

వరకు అందుబాటులో ఉంటాయని, ప్రజలు దీనిని గమనించాలని జిల్లా కలెక్టర్ జె.నివాస్ కోరారు. భారత ప్రధాని ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్ డౌన్

కొనసాగుతుందని, దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటుచేసి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. కరోనా

వ్యాప్తి నివారణపై బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని స్పందన విభాగంలో జిల్లా కలెక్టర్ జె.నివాస్ మీడియా ప్రతినిధుల సమావేశాన్ని ఏర్పాటుచేసారు. జిల్లాలో లాక్

డౌన్ పక్కాగా జరగుటకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగా కూరగాయల బజార్లు, ఇతర నిత్యావసర వస్తువులు  à°‰à°¦à°¯à°‚ ఆరు à°—à°‚à°Ÿà°² నుండి మధ్యాహ్నం à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ వరకు

అందుబాటులో ఉంటాయన్నారు. పాలు, పెరుగు, మందులు ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటాయని స్పష్టం చేసారు. నిత్యావసర సరుకులను, కాయగూరలను ప్రతీ రోజూ

కొనుగోలు చేయకుండా నాలుగు రోజులకు సరిపడా కొనుగోలు చేసుకోవాలని కోరారు. సాయంత్రం ఆరు à°—à°‚à°Ÿà°² నుండి ఉదయం ఆరు à°—à°‚à°Ÿà°² వరకు  à°•à°¦à°²à°¿à°•à°²à± పూర్తిగా నిషేధించడం జరిగిందని,

ప్రజలుగాని, ఎటువంటి వాహనాలు తిరగరాదని స్పష్టం చేసారు. లక్ష్మణరేఖను దాటవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిలుపునిచ్చాయని, వాటికి  à°¤à°ªà±à°ªà°¨à°¿à°¸à°°à°¿à°—à°¾ ప్రతీ ఒక్కరూ

కట్టుబడి ఉండాలని కలెక్టర్ చెప్పారు. నగరంలో ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎన్.టి.ఆర్.నగరపాలకోన్నత పాఠశాల, పి.ఎస్.ఎన్.

నగరపాలకోన్నత పాఠశాలల్లో కూరగాయల బజార్లను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. పాత బస్టాండ్ వద్ద కూరగాయల మార్కెట్ ను 80 అఢుగుల రహదారికి మార్పుచేసామని తెలిపారు. ఈ

మార్పును ప్రజలు గమనించి సహకరించాలని కోరారు. కూరగాయల ధరలు తెలియజేస్తూ బోర్డులను ఏర్పాటుచేయడం జరిగిందన్నారు. నిత్యావసర సరుకుల కొరత ఉండబోదని, ఇతర జిల్లాల

నుండి వచ్చే వాహనాల కొరకు రాష్ట్రస్థాయిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేసారని, సరుకుల లారీల రాకపోకలకు సమస్యలు తలెత్తితే 1902 టోల్ ఫ్రీ నెంబరుకు ఫోన్ చేసి సమస్యలు

తెలియజేయవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండాలని, సామాజిక దూరం పాటించాలని సూచించారు. విదేశాల నుండి వస్తున్న వారిపై సర్వేలియన్స్ చేస్తున్నామని వారంతా

స్వీయ గృహ నిర్భందంలో ఉన్నారన్నారు. స్వీయ గృహ నిర్బంధం పాటించని వారి పాస్ పోర్టులను రద్దు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కరోనా సంబంధిత విషయాలు, విదేశాల

నుండి వచ్చే వారి వివరాలను 104 ఫోన్ నంబరుకు తెలియజేయాలన్నారు. నిత్యావసర సరుకుల రవాణాకు ఏ సమయంలోను అభ్యంతరం లేదని, నిత్యావసర సరుకుల సంబంధించిన ఉద్యోగుల

కదలికలకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అనుమానస్పదంగా ఉన్న 34 మందిని                    à°¡à°¾. బి.ఆర్.అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఏర్పాటుచేసిన నిర్బంధ గదులలో ఉంచడం

జరిగిందని చెప్పారు. శ్రీకాకుళంలో నాలుగు క్వారంటీన్ కేంద్రాలు, ప్రతీ నియోజకవర్గంలో ఒక్కొక్క క్వారంటీన్ కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు చెప్పారు. జిల్లా

కేంద్రంలో 100 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసామని చెప్పారు. ప్రతి పది మందికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని కలెక్టర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు ఇతర

ప్రాంతాల నుండి  1625 మంది వచ్చారని, వారిలో 1094 మంది స్వీయ నిర్బంధంలో ఉన్నారన్నారు. అందులో  531 స్వీయ నిర్బంధం పూర్తయినట్లు కలెక్టర్ వివరించారు. నిత్యావసర సరుకులు,

కూరగాయలు, పండ్ల ధరలు అదుపులోనే ఉన్నాయని, అధిక ధరలకు విక్రయించిన వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం ఇన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ యువత

కొంతమంది ఆరుబయట తిరుగుతున్నారని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. యువతకు ఇటువంటి సమయం మరలా రాబోదని, తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ తమ

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా లాక్ డౌన్ విజయవంతం అయిందని, ఇందుకు ప్రజలు కూడా పూర్తిస్థాయిలో

సహకరిస్తున్నారని, వారందరికి అభినందనలను  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam