DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికార పార్టీ నేతలకు సామాజిక దూరం నిబంధన అవసరం లేదా?

*రైతు బజార్ లో మంత్రి వెంట పార్టీ నేతలు ఎందుకు. . .*

*పార్టీ నేతలకు లాక్ డౌన్ మినహాయింపు ఉందా? . .*  

*మంత్రి తో అధికారులు ఉండాలి కానీ పార్టీ నేతలకి పనేంటి?. . .

.* 

*పార్టీ నేతలకు సామాజిక దూరం నిబంధన అవసరం లేదా?*

*సామాజిక దూరం ప్రజలు పాటిస్తున్నారు . . .  à°ªà°¾à°°à±à°Ÿà±€ నేతలే. . . *

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్, రిపోర్టర్,

విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, మార్చి 26, 2020 (డిఎన్ఎస్) : యావత్ భారత దేశమంతా లాక్ డౌన్ ప్రకటిస్తే  à°…ధికార పార్టీ నేతలను దీన్నిపెద్దగా పట్టించుకున్నట్టు లేదు.

గురువారం ఉదయం పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్ నగరం లోని ఏ ఎస్ రాజా మైదానంలో పెట్టిన రైతు బజార్ ను పరిశీలించారు. ఈయన వెంట జిల్లా అధికారులు ఉండాలి కానీ, పార్టీ

నేతలకు పనేంటో ఎవరికి అర్ధం కాలేదు. ఈయన పర్యటనలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎల్. శివశంకర్ పాల్గొని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. ఈయనకంటే ముందే

పార్టీనేతల హడావిడి ఎక్కువైంది. ఇదేదో పార్టీ అధీనంలో జరుగుతున్నా కార్యక్రమం గా భావించి, సమస్యలను తామే పరిశీలించాలి అనే రీతిలో పెద్ద సంఖ్యలో మందీ మార్బలం

తో పార్టీ నేతలు మంత్రి వెంట పాల్గొన్నారు. 

పార్టీ నేతలందరూ మంత్రివెంటే ఉండడం, పైగా సామాజిక దూరం అనే విషయమే తమకు పట్టదు అన్న రీతిలో వ్యవహరించడం సామాన్య

ప్రజలకు ఆశ్చర్యాన్ని కల్గించింది. సామాన్యుల పై లాఠీ ఝుళిపించే పోలీసులకు పార్టీనేతల వైఖరి కనిపించలేదా అని రైతు బజార్ కు వచ్చిన వినియోగ దారులు

ప్రశ్నిస్తున్నారు. 

పోలీసుల తీరు పై విమర్శలు:. . .

విధుల్లో ఉన్న పోలీసుల్లో కొందరు మాత్రం అతిగా ప్రవర్తిస్తుండడం విమర్శలు ఎదుర్కొంటున్నారు. నగర

వీధిలో మనిషి కనిపిస్తే అతిగా స్పందించడం, మీడియా వారిపై కూడా కొన్ని సందర్భాల్లో హెచ్చరించిన  à°ªà±‹à°²à±€à°¸à± సిబ్బంది,  à°…ధికార పార్టీ నేతల పట్ల సానుకూలంగా ఉండడం

గమనార్హం. ఇదే రైతు బజార్ లో వినియోగ దారులు దగ్గరగా ఉంటె హెచ్చరిక జారీ చెయ్యడం విశేషం. అదే పోలీసులకు మంత్రి వెంట పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు రావడం మాత్రం

కనపడక పోవడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.   

సింహాచలం లోనూ అదే తీరు. . .:

సామాజిక దూరం అనేది పార్టీకి పట్టదు అనే విషయం సింహాచల దేవాలయంలో కూడా కనిపించింది.

అధికార పార్టీకి చెందిన ట్రస్ట్ బోర్డు సభ్యులు, వాళ్ళ బంధువులు, ఇతర సిబ్బంది పెద్ద సంఖ్యలో బుధవారం జరిగిన అప్పన్న పెళ్లిరాట ఉత్సవం లో దగ్గర దగ్గరా పాల్గొని

మరీ ఫోటోలకు ఫోజులిచ్చేశారు. ఈ గ్రూప్ లో ఆలయ ఈఓ వెంకటెశ్వర రావు కూడా ఉండడం గమనార్హం. అధికార పార్టీకి లాక్ డౌన్ రూల్స్ పట్టవు అన్న రీతిలో వ్యవహరించడం అమానుషం.

 

గతంలో మంత్రి వెంట ఎంతమంది పాల్గొన్న పెద్దగా పట్టింపు ఉండదు, అయితే ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో సామజిక దూరం ఉండాలి అనే నిబంధన దేశ ప్రజలందరికీ ప్రధాన

మంత్రి తో సహా వర్తిస్తుంది అని సాక్షాతూ ప్రధాని నరేంద్ర మోడీ యే ప్రకటించారు. అయితే ఆ నిబంధనను నగరం లోని అధికార పార్టీ నేతలు ఖాతరు చెయ్యక పోవడం

గమనార్హం. 

అయితే పార్టీ నేతలు ఏ హోదాలో మంత్రి వెంట పర్యటనలో పాల్గొన్నారో మాత్రం తెలియదు.

గురువారం మంత్రి జరిపిన రైతు బజార్ పర్యటనలో మంత్రి వెంట

వైసీపి విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ పట్నం తూర్పు నియోజకవర్గ ఇంచార్జి అక్కరమాని విజయనిర్మల, స్థానిక నాయకులు పాల్గొన్నారు. జిల్లా

అధికారులు, పోలీసులు కూడా పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam