DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిత్యావసరాల సరఫరాకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు . . .

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 26, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు నిత్యావసరాల సరఫరాకు

ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పౌర సరఫరాల కమిషనర్ ఈ కమిటీకి సమన్వయ కర్తగా వ్యవహరించనున్నారు.

 à°‡à°¤à°° సభ్యులు వీరే. . . రవాణా శాఖా కమిషనర్, రాష్ట్ర డిజిపి,  à°¡à±à°°à°—్స్ కంట్రోల్ డైరక్టర్, ఉద్యానవన శాఖ ప్రత్యేక కమిషనర్.  à°µà±à°¯à°µà°¸à°¾à°¯ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమిషనర్,

తూనికలు కొలతల కంట్రోలర్, పాల ఉత్పత్తుల సహకార సంఘం à°Žà°‚à°¡à°¿.  à°²à± సభ్యులు à°—à°¾ ఉంటారు.

ఈ కమిటీ ఈ నెల 24 ఆదివారం విజయవాడ లోని ఎన్ టి ఆర్ వైద్య ఆరోగ్య విశ్వ విద్యాలయంలో

సమావేశమై పలు నిర్ణయాలు తీసుకుంది.  

నిత్యవసర వస్తువుల రవాణా, సప్లై చైన్‌, గ్రాసరీస్‌, పాలు, బ్రెడ్‌, పండ్లు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపలు, వాటి రవాణా,

రెస్టారెంట్లలో టేక్‌ అవే, హోం డెలివరీ, పెట్రోల్‌, బంకులు, ఎల్పీజీ గ్యాస్‌, ఆయిల్‌ ఏజన్సీస్‌, గ్యాస్‌ గోడౌన్లు, సంబంధిత రవాణ, ప్రైవేట్‌ సహా అన్ని సెక్యూరిటీ

సేవలు, కరోనా నివారణకు ఉపయోగపడే ప్రైవేట్‌ సంస్థలు, విమానాశ్రయాలు, సంబంధిత సేవలను ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.

అదే విధంగా బ్యాంకులు,

ఏటీఎంలు, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఐటీ, ఐటీ ఆధారిత సేవలు, టెలికాం,తపాలా, అంతర్జాల సేవలు, ఆస్పత్రులు, ఆప్టికల్‌ దుకాణాలు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు, ఫార్మా,

తయారీ, రవాణాకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది.

పూర్తిస్థాయిలో పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లు, డివిజినల్‌, మండల

కార్యాలయాలు, పోలీసు, వైద్య, ఆరోగ్య శాఖలు, పట్టణ ప్రాంత స్థానిక సంస్థలు, పంచాయతీరాజ్‌ సంస్థలు, అగ్నిమాపక శాఖ, ఎక్సైజ్‌, వాణిజ్య పన్నులు, రవాణా కార్యాలయాలు,

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల పన్నుల కార్యాలయాలు, విద్యుత్‌, నీటిసరఫరా కార్యాలయాలు, వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక శాఖ లు పనిచేయనున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam