DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉదయం 6 గంటలుకే దేవాలయాలు మూసెయ్యాలి: కలెక్టర్ 

*హిందూ, ముస్లిం, క్రైస్తవ అన్నీ మూతపడాల్సిందే: అధికారులు*  
 
*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, మార్చి 26, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా

వ్యాప్తి నివారణలో భాగంగా దేవాలయాలు, మసీదులు, చర్చి తదితర ప్రార్ధనా మందిరాలు ఉదయం 6 గంటల నాటికి మూసి వేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. ప్రార్ధనా

మందిరాల్లో నిర్వహించవలసిన పూజలు, ప్రార్ధనలు త్వరగా పూర్తి చేసుకుని ఉదయం 6 గంటల నాటికి తులుపులు మూసి వేయాలని అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో

శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పర్యవేక్షక అధికారులు, ఆరోగ్య సిబ్బంది, సంబంధిత అధికారులతో ఇంటింటి సర్వే పై గురు వారం జిల్లా కలెక్టర్

సమీక్షించారు. కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ విదేశాల నుండి వచ్చిన వారిని జల్లెడ పట్టాలన్నారు. జిల్లాకు విదేశాల నుండి వచ్చిన వారు 1636 మంది ఉన్నారని వారిలో కంచిలి,

గార, సోంపేటల తరువాత ఇచ్చాపురం, శ్రీకాకుళం లకు వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నారు. ఏ ఒక్కరినీ గుర్తించకుండా వదిలి పెట్టరాదని స్పష్టం చేసారు. ఎవరికి

ఎటువంటి మినహాయింపువద్దని, నిర్లక్ష్యం పనిచేయదని తెలిపారు. నిర్లక్ష్యం చేస్తే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారని సూచించారు. ఎక్కడ ఉన్నా బయటకు

తీసుకురావాలని ఆదేశించారు. ఇందులో మత్స్యకారులు అధికంగా ఉన్నారని చెప్పారు. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఇంకా ఏడు గురిని గుర్తించాలని అన్నారు. ఇటలీ, సింగపూర్,

మలేసియా, యుకె, ఇరాన్, యుఎస్ఏ, ఖజాకిస్తాన్, దుబాయ్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాల నుండి జిల్లాకు వచ్చారని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపే ఏ ఒక్క అంశం పట్లా

అజాగ్రత్త వద్దని హితవు పలికారు. వచ్చిన వారి చిరునామాలను అనుసరించి వివరాలు వెలికితియ్యాలని అన్నారు. వీరి వివరాలు ఎంబసీకి కూడా అందజేయం జరుగుతుందని తెలిపారు.

కరోనా స్టిక్కర్లు ఇళ్లకు పెట్టాలని, ట్రాకింగ్ ఎట్టి పరిస్థితుల్లోను జరగాలని అన్నారు. ఏ సచివాలయం, ఏ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోకి ఆయా వ్యక్తులు

వస్తున్నారో గుర్తించాలని చెప్పారు. శానిటరీ కార్యదర్సులు ప్రతి దుకాణం ముందు మార్కింగ్ ఉండేటట్లు చూడాలని ఆదేశించారు. మార్కింగ్ లేని దుకాణాలు మూసివేయాలని

స్పష్టం చేసారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు మాత్రమే నిత్యావసర వస్తువుల విక్రయానికి అనుమతి ఉందని., పాలు, పెరుగు, మందుల దుకాణాలకు మాత్రమే సాయంత్రం 6 గంటల వరకు అనుమతి

ఉందని చెప్పారు. పాలు, పెరుగు విక్రయాలు పేరుతో ఇతర వస్తువుల దుకాణాలు తెరిచి ఉంచరాదని కలెక్టర్ స్పష్టం చేసారు. కేవలం పాలు, పెరుగు మాత్రమే సాయంత్రం వరకు

విక్రయాలు చేయవచ్చని అన్నారు. ఆలయాలు కూడా ఉదయం 6 గంటలు నాటికి మూసివేయాలని, పిల్లలు బయట ఆడకుండా ఇళ్ళల్లో ఉండే విధంగా అవగాహన కల్పించాలని అన్నారు. సామాజిక దూరం

కచ్చితంగా పాటించాలని, ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని వాలంటీర్లు గమనించాలని చెప్పారు. వివరాలను యాప్ లో నమోదు చేయాలని అన్నారు. సర్వే తక్షణం

పూర్తి చేయాలని స్పష్టం చేసారు. నగరంలో మరింత జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటూ కొద్ది రోజులు కష్టపడి పనిచేయాలని తద్వారా జిల్లాకు మంచి ఫలితాలు అందుతాయని అన్నారు.

వచ్చే వారం రోజులు అత్యంత కీలమైనవని చెప్పారు.

నగర పాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య మాట్లాడుతూ ప్రతి ఇంటి తనిఖీ పక్కాగా, పకడ్బందీగా ఉండాలన్నారు. పటిష్టమైన

తనిఖీ జరగకపోతే తీవ్ర ప్రమాదానికి కారణమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉదయం, సాయంత్రం కూడా తనిఖీలు నిర్వహించాలని కోరారు.

ఈ సమావేశంలో ప్రత్యేక

అధికారులు ఎవిఎస్వి జమదగ్ని, టివివి ప్రసాద రావు, ఆరోగ్య అధికారి జి.వెంకట రావు, వైద్య శాఖ అధికారి డా కృష్ణ మోహన్, తహశీల్దార్ దిలీప్ చక్రవర్తి, తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam