DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవైష్ణవ గోష్ఠి ఆన్ లైన్ తరగతులకు పెరుగుతున్న ఆదరణ* 

*ఉత్సాహంగా. . .ఉల్లాసంగా. . అధాత్మిక తరంగాల్లో చిన్నారులు* 
 
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 29 , 2020 (డిఎన్ఎస్) : కరోనా కట్టడి తో

భారత దేశం తో పాటు ఇతర దేశాల్లో సైతం ఇళ్లకే పరిమితమైన చిన్నారులను ఆధ్యాత్మిక రంగం లో తీర్చిదిద్దుతూ శ్రీవైష్ణవ గోష్ఠి ఆన్ లైన్ శిక్షణ తరగతులను

ప్రారంభించింది. à°ˆ గోష్టి లో పాల్గొనేందుకు మరింత మంది చిన్నారులు ఆసక్తి కనపరుస్తున్నారు. 

ఈ కార్యక్రమం లో విశాఖపట్నం (బాలయ్యశాస్త్రి లే అవుట్,

మురళీనగర్ ప్రాంతాల నుంచి)  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం (మునిసిపల్ కొలని,  à°¦à°¾à°¨à°µà°¾à°¯à°¿ పేట ప్రాంతాల నుంచి), బెంగుళూరు తో పాటు, బ్రంప్టాన్ ( కెనడా ) నుంచి చిన్నారులతో పాటు, పెద్దలు

కూడా పాల్గొన్నారు.    

కేజీ నుంచి పిజి వరకూ అందరూ ఇళ్లకే పరిమితమవడంతో చిన్నారులకు ఆధ్యాత్మిక పరమైన అంశాలను, శ్లోకాలను నేర్పించడం ద్వారా కాలాన్ని

సద్వినియోగం చెయ్యాలి అనే సంకల్పంతో శ్రీవైష్ణవ గోష్ఠి బృదం ఆన్ లైన్ తరగతులను ప్రారంభించింది. 

ఈ తరగతులను ఇంటర్నెట్ ద్వారా వీడియో లో అందరూ ఒక యాప్ లో

కనెక్ట్ అయి à°’à°• నిర్దుష్ట సమయంలో పలు శ్లోకాలను అభ్యసిస్తున్నారు. 

రాజమహేంద్రవరానికి చెందిన అధ్యాపకులు మరంగంటి విజయ్ శ్రీనివాస్, విశాఖ పట్నం కు చెందిన

ముడుంబై లక్ష్మి శ్రీనివాస్ à°² పర్యవేక్షణలో à°ˆ తరగతులు నిర్వహించబడుతున్నాయి.  

ముందుగా ప్రార్ధన శ్లోకాలు శ్రీశైలేశ దయాపాత్రం . ..  à°¤à±‹ ప్రారంభించి, లక్ష్మి

అష్టోత్తరం, శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, ముకుందమాల, ఆదిత్య హృదయం, సంక్షేప రామాయణం తదితర అమూల్య స్తోత్ర రత్నాలను నేర్పించడం జరుగుతోంది. 

అనంతరం

చిన్నారులలో ప్రతిభను వెలికి తీసే ప్రక్రియ లో భాగంగా చిత్రలేఖనం, కధలు, గీతాలాపన తదితర అంశాలను ప్రదర్శిస్తున్నారు. గుంటూరు రామానుజం గారి కుమారుడు  à°†à°²à°ªà°¿à°‚à°šà°¿à°¨

అన్నమాచార్య కీర్తన అందరినీ ఆకట్టుకుంది.  

ఈ శిబిరంలో కెనడా నుంచి శ్రీ కౌస్తుభ్, శ్రీ సుహిత్, శ్రీవిద్య, విశాఖపట్నం నుంచి రామ్ నారాయణ, సివిరామన్, సాయిరాం,

కళ్యాణి, గుంటూరు రామానుజం కుటుంబ సభ్యులు, రాజమహేంద్రవరం నుంచి నీలకృష్ణ, మౌద్గల్య, వనజ, ఎం వి పద్మావతి, బెంగుళూరు నుంచి రుక్మిణి ప్రజ్వలిత, శ్రీ వత్సాంకిత్,

వైభవి, మారుతి లత, తదితరులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam