DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏప్రిల్ 14 తర్వాత లాక్‌డౌన్‌ పొడిగింపు లేనట్లే: కేంద్ర కార్యదర్శి 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 30, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తిని నిరోధించడం లక్ష్యంగా కేంద్ర

ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 21 రోజుల లాక్‌డౌన్‌ను మరింత పొడిగించవచ్చనే ప్రచారం కేవలం ఊహాగానం మాత్రమేనని తేలిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో నరేంద్రమోదీ

సర్కారుకు లాక్‌డౌన్ పొడిగించే ఆలోచనేదీ లేదని స్వయాన కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబా ధృవీకరించినట్లు ప్రసారభారతి న్యూస్ సర్వీసెస్ (పీబీఎన్ఎస్) తన

బులిటెన్‌లో స్పష్టంచేసింది.

కరోనా లాక్‌డౌన్ ఏప్రిల్ 14 తర్వాత కూడా మరింత పొడిగించనున్నారని ఆరోపించిన నివేదికలు అవాస్తవమని ప్రభుత్వరంగ ప్రసార మాధ్యమం

అయిన ‘ప్రసరార్ భారతి న్యూస్ సర్వీస్’ పేర్కొంది. ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం మరో వారం లాక్‌డౌన్ పొడిగించవచ్చన్న శీర్షికతో కూడిన నివేదికను

ప్రస్తావిస్తూ à°† వార్త నకిలీదని ధృవీకరించింది. à°ˆ వార్తా కథనంపై పీబీఎన్ఎస్ కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతో సంప్రదింపులు జరిపినట్లు సోమవారం à°’à°• ట్వీట్‌లో

తెలిపింది. ‘‘క్యాబినెట్ కార్యదర్శి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ విస్తరించే ప్రణాళిక ఏదీ లేదని అన్నారు’’ అని à°† ట్వీట్‌లో వెల్లడించింది.

మార్చి

22à°¨ à°’à°• రోజు ‘జనతా కర్ఫ్యూ’ తరువాత, మార్చి 24à°¨ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మార్చి 25 నుండి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. à°† నిర్ణయం ప్రకారం దేశవ్యాప్తంగా

ఏప్రిల్ 14 అర్ధరాత్రి వరకు లాక్‌డౌన్ కొనసాగుతుంది. లాక్‌డౌన్ అన్ని ప్రజా రవాణా వ్యవస్థలను నిలిపివేసిన విషయం తెలిసిందే. కేవలం అత్యవసర పనులను మాత్రమే

లాక్‌డౌన్ నుంచి మినహాయించిన ప్రభుత్వం ప్రజల్ని ఇళ్లకే పరిమితం చేయాలని సాధ్యమైనంత వరకూ ప్రయత్నించింది.

సామాజిక దూరం పాటించడంతో పాటు వ్యక్తిగత

పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చి కరోనావైరస్ నుంచి స్వీయ రక్షణ పొందాలని ప్రజలకు సూచించిన ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రాల సమన్వయంతో తను ఆశించిన లక్ష్యాన్ని

చేరుకున్నట్లే కనిపిస్తోంది. ప్రపంచ దేశాలతో పోల్చిచూస్తే భారత్ పరిస్థితి చాలా నయమన్న ప్రచారమూ వినిపిస్తోంది. à°ˆ నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగించే అవకాశాలు

దాదాపు ఉండవనే చెప్పవచ్చు. కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి సమయంలో మనుగడకు అవసరం లేని అన్ని దుకాణాలు, సేవలు కూడా నిలిపివేయడం వల్ల కొంత మంది స్వల్పంగా ఇబ్బంది

పడ్డప్పటికీ దేశ ప్రయోజనం రీత్యా దీన్నెవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. పైగా కేంద్రం కూడా ఇటీవల ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించి, అమలుకు ఉపక్రమించింది.

బ్యాంకు రుణాలు, ఈఎంఐ వాయిదాలపై మారిటోరియాన్ని ప్రకటించి అమలుచేయమని ఆర్బీఐకి సూచించింది.

అయితే, లాక్‌డౌన్ వల్ల వలస, రోజువారీ కూలీల జీవనోపాధి

ఆకస్మికంగా ఆగిపోవడంతో ఆయా వర్గాలు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మాట వాస్తవమేనని ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఢిల్లీ, ముంబై సహా ఇతర పెద్ద

నగరాల్లో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న వేలాది మంది వలస కార్మికులు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఇతర రాష్ట్రాల్లోని తమ సొంత గ్రామాలకు వెళ్లడం

ప్రారంభించారని కేంద్రం గ్రహించింది. వందల, వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సిన à°ˆ కార్మికులు బహిరంగ కదలికలను పరిమితం చేసిన లాక్‌డౌన్ మధ్య హైవేలలో

చిక్కుకుపోయారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు వలస కూలీలను భారీగా బహిష్కరించడంతో వేలాది మంది ఢిల్లీ-ఎన్సీఆర్‌లోని బస్ స్టేషన్లలో

తలదాచుకుంటున్నారు. ఇక, ఇప్పటివరకు, భారతదేశం 1,100కి పైగా కరోనావైరస్ కేసులను నమోదు చేసింది. మరణించిన వారి సంఖ్య 25 దాటింది. ప్రపంచవ్యాప్తంగా, కరోనావైరస్ 30,000 మందికి

పైగా ప్రాణాలను హరించింది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam