DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిత్యావసర వస్తు సామగ్రి పంపిణీ వద్దు - సహకరించండి

*జనం ఎక్కువ ఉండకూడదనే లాక్ డౌన్ .. : జిల్లా కలెక్టర్*  

*కరోనా సహాయానికి విరాళాల రూపంలో అందించండి* 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). .

.*

శ్రీకాకుళం, మార్చి 31, 2020 (డి ఎన్ ఎస్) : శ్రీకాకుళం జిల్లాలో లాక్ డౌన్ వలన ఏర్పడిన పరిస్ధితుల రీత్యా వ్యక్తులు, సంస్ధలు పేదలకు వస్తు సామగ్రి చేపడుతున్నారని,

వాటిని నిలిపివేయాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. ఈ మేరకు మంగళ వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ బహిరంగ ప్రదేశాల్లో ప్రజల రద్దీని తగ్గించుటకు తద్వారా కరోనా

వ్యాప్తి నివారణకు లాక్ డౌన్ చేయడం జరిగిందని గ్రహించాలని అన్నారు. వ్యక్తుల మధ్య భౌతిక దూరం ఉండాలని అయితే సామగ్రి పంపిణీ చేసే సమయంలో విపరీతమైన రద్దీ ఉండటం,

భౌతిక దూరం పాటించకపోవడం గమనించడం జరిగిందన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు ఇది మంచి చర్య కాదని ఆయన పేర్కొన్నారు. గుంపులుగా ఉండకూడదని, జిల్లాలో 144వ సెక్షన్

అమలులో ఉందనేది గుర్తించాలని ఆయన చెప్పారు. ఎక్కడా 5గురు కంటే ఎక్కువగా తిరగరాదని ఆయన స్పష్టం చేసారు. పేదలకు, నిరాశ్రయులకు వస్తు సామగ్రి అందించడం

సంతోషదాయకమేనని అయితే నేరుగా పంపిణీ చేయకుండా సరుకులును తహశీల్దార్లకు, మునిసిపల్ కమీషనర్లకు అందించాలని అచ్చట నుండి సంబంధిత వ్యక్తులకు పంపిణీ

జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కరోనా వ్యాప్తి లేకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు ఏమి నమోదు కాలేదని రానున్న

రోజుల్లో సైతం పాజిటివ్ కేసులు ఏమి రాకుండా ఉండుటకు ప్రజల క్రమ శిక్షణతోనే సాధ్యం కాగదలని కలెక్టర్ పేర్కొన్నారు.

కరోనా సహాయానికి విరాళాలు అందించండి : 
/> కరోనా బాధితుల సహాయానికి దాతలు ఉదారంగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ కోరారు. విరాళాలను ఈ క్రింద తెలిపిన బ్యాంకు ఖాతాలో జమచేయాలని

కోరారు.

జిల్లా కలెక్టర్, శ్రీకాకుళం(కోవిడ్ - 19),  
ఖాతా సంఖ్య – 070001000298,
ఐఎఫ్ఎస్ సి/ ఆర్ à°Ÿà°¿ జి ఎస్/ ఎన్ఇఎఫ్ à°Ÿà°¿ కోడ్ – ఐసిఐసి 0000700,
ఐ సి ఐ సిఐ బ్యాంకు, శ్రీకాకుళం

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam