DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంకా లాస్ట్ బాల్ వెయ్యలేదు. . .  కిరణ్ ఏ పార్టీలో చేరలేదు.

విశాఖపట్నం, జులై 01 , 2018 (DNS Online ): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఇంకా ఏ పార్టీ లోనూ చేరినట్టు అధికారికంగా ప్రకటించలేదు.

ఆదివారం 
ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇంచార్జి, కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ భేటీ కిరణ్ కుమార్ ఇంటికి వెళ్లి మరీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి రావాలంటూ

ఆహ్వానం పలికారు. దీంతో మీడియా వర్గాలన్నీ కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిపోయారు అంటూ ప్రసారాలూ మొదలెట్టేశాయి. అయితే సమావేశం అనంతరం బయటకు వచ్చిన

కిరణ్ కుమార్ రెడ్డి మీడియా తో మాట్లాడేందుకు నిరాకరించారు. ఏ పార్టీ లో చేరేది ఇప్పుడు చెప్పలేను అంటూ వ్యాఖ్యానం మాత్రం చేశారు. దీంతో అయన కాంగ్రెస్ లో

చేరతారా లేదా అనేది అనుమానంగానే ఉంది. అయితే రాష్ట్ర విభజన సమయం లో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన అయన, తిరిగి పార్టీలోకి వస్తే పార్టీ ఆయనకి

లొంగి పోయినట్టు సందేశం ఇచ్చినట్టేననే అనుమానాలూ ఉన్నాయి. అయితే విభజన సమయం లో అధిష్ఠానం తనకు ఏ విధమైన సమాచారాన్నీ ఇవ్వలేదు అని ఆనాడే విలేకరుల సమావేశం పెట్టి

మరీ చెప్పారు కిరణ్ కుమార్. అయన మాట వినకుండా రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడాన్ని అయన బహిరంగానే దుయ్యబట్టారు, సోనియా సహా పార్టీ పెద్దలు అందరికీ నానా

చీవాట్లూ పెట్టారు. అలాంటిది ఆయన్ని తిరిగి పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం అంటే కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు, పార్టీలోని పెద్దలంతా ...  à°µà°¾à°³à±à°²à±‡à°¨à°¾ అనే సందేహం

కూడా బలపడుతుంది. ఇప్పడికే కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ తెలుగుదేశం లో చేరి, ప్రభుత్వ పదవి కూడా చేపట్టారు. 
ఇలాంటి పరిస్థితి లో కిరణ్ కుమార్

రెడ్డి అసలు కాంగ్రెస్ లో చేరతారా లేదా అనేది అనుమానమే. అయితే దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి మీడియా కు కనిపించడంతో అయన రాజకీయం గా మరోమారు

à°°à°‚à°— ప్రవేశం చేస్తారు అనే విషయం బలపడుతోంది. కొంతాకాలం క్రితం అయన బీజేపీ లో చేరవచ్చు అనే సంకేతాలూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా కాంగ్రెస్  à°†à°‚ధ్ర వ్యవహారాల

ఇంచార్జి ఉమెన్ చాందీ కిరణ్ కుమార్ రెడ్డి ఇంటికే వెళ్లడం తో మరోమారు ప్రజల్లో చర్చ జరుగుతోంది.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam