DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రధాని పిలుపు ను స్వాగతించిన ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి

*తొమ్మిది నిమిషాల సేపు ప్రకృతిని ప్రార్ధించండి: చిన్న జీయర్*

 

*దీప ప్రజ్వలన చెయ్యండి - దేశ ఐక్యతను చాటండి* 

*ప్రధాని పిలుపు ను à°¸à±à°µà°¾à°—తించిన

ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి* 

*జీయర్ ఆశ్రమంలో విద్యార్థులతో కలిసి దీప ప్రజ్వలన లో పాల్గొంటాం.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.*

విశాఖపట్నం, ఏప్రిల్ 04, 2020 (డిఎన్ఎస్) : దేశ ఐక్యతను చాటే విధంగా à°ˆ నెల 5 à°¨ రాత్రి 9 à°—à°‚à°Ÿà°² సమయంలో 9 నిమిషాల పాటు  ప్రతి ఒక్కరూ దీప ప్రజ్వలన చెయ్యండి అని దేశ ప్రధాని

నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చిన్న జీయర్ స్వామి స్వాగతించారు. దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సమయంలో ప్రజల మనస్సులో ఒక తెలియని ఆందోళన

నెలకొంటుందని, దాన్ని పోగొట్టి, దేశ ఐక్యతను చాటేవిధంగా దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని కేవలం 9 నిమిషాల పాటు చెయ్యడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి బాల్కనీ

లేదా గుమ్మంలోకి వచ్చి ప్రకృతి మాతను ప్రార్ధించడం ద్వారా ఒక ఆహ్లాదకరమైన భావన కలుగుతుందన్నారు. అదే సందర్భంలో ప్రకృతి లో సంభవించిన కలుషిత వాతావరణం

ప్రభావంగా ఎన్నో రుగ్మతలు కలుగుతున్నాయని, వాటిని తొలగించమని ప్రార్ధించవచ్చని లేదా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే విధంగా భావించి కొందరు, ఎవరికీ తోచిన విధంగా

వారు భావించవచ్చన్నారు. అయితే à°ˆ ప్రక్రియ మనుషుల్లో నెలకొన్న à°’à°• అసందిగ్ద వ్యధను తొలగించేందుకు చేస్తున్న à°’à°• ప్రక్రియ à°—à°¾ కూడా భావించవచ్చన్నారు. 

à°†

తొమ్మిది నిమిషాల పాటు విద్యుత్ దీపాలను నిలిపి వేసి, స్వచ్ఛమైన ఆవునెయ్యి లేదా నువ్వుల నూనె తో దీపాన్ని వెలిగించి ప్రకృతి మాతను హారతి లా ఇవ్వడం ద్వారా ప్రకృతి

పట్ల కృతజ్ఞత ప్రదర్శించినట్టవుతుందన్నారు. ఒక్క సారిగా మన ప్రాంతమంతా దీప కాంతులతో దేదీప్య మానంగా వెలుగుతుంటే ఆ సౌందర్యం మరింత అద్భుతంగా

ఉంటుందన్నారు. 

ఈ దీప ప్రజ్వలనతో మన జీవితాల్లో మంచి జరగాలని, ప్రపంచాన్ని పట్టి పీడించిన వ్యధలు తొలిగిపోవాలని సంకేతం కూడా ఇచ్చినట్టవుతుందన్నారు. దేశ

ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఈ పిలుపు లో మంచి నే చూడాలని, విపరీత భవనాలు చెయ్యడం సబబు కాదన్నారు. తాము సైతం శంషాబాద్ జీయర్ ఆశ్రమం లో వేదపాఠశాలలో ఈనెల 5 వ తేదీ

ఆదివారం రాత్రి 9 à°—à°‚à°Ÿà°² సమయంలో తమ విద్యార్ధులందరితో కలిసి దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam