DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దీప ప్రజ్వలనతో భారత దేశ ప్రజా ఐక్యత చాటి చెప్పాం: చిన్న జీయర్ 

*ప్రధాని పిలుపు కు శంషాబాద్ జీయర్ ఆశ్రమంలో దీప ప్రజ్వలన* 

*జీయర్ ఆశ్రమంలో విద్యార్థులతో కలిసి మానవాళి రక్షణకై వేదపఠనం*

*స్వామిజి నుంచి సామాన్యుల

వరకూ దీప ప్రజ్వలన lo భాగస్వాములే .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 05, 2020 (డిఎన్ఎస్) : దీప ప్రజ్వలనతో భారత దేశ ప్రజా ఐక్యత చాటి

చెప్పగలిగామని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి తెలియచేసారు. దేశ ఐక్యతను చాటే విధంగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో

ప్రతి ఒక్కరూ దీప ప్రజ్వలన చెయ్యండి అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుకు ఆయన స్వాగతిస్తూ శంషాబాద్ లోని తమ జీయర్ ఆశ్రమం లో వేదవిద్యార్ధులతోను,

ఆశ్రమవాసులతోను కలిసి దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమం లో పాల్గొన్న దేశ ప్రజలకు అనేక

మంగళశాసనములు తెలియచేసారు. దీప ప్రజ్వలన చేసిన తొమ్మిది నిమిషాల సమయం వేద విద్యార్థుల వేదపఠనంతో ఆశ్రమ ప్రాంగణమంతా మారు మ్రోగిపోయింది. 

దేశ ప్రధాని

పిలుపునకు స్వాగతిస్తూ ఆధ్యాత్మిక వేత్తలైన జీయర్ స్వామి నుంచి జీయర్ స్వామి శిష్యులు, చిన్నారులు, వృద్దులు, మహిళలు,  à°¸à°¾à°®à°¾à°¨à±à°¯ ప్రజల వరకూ దీప ప్రజ్వలనలో అందరూ

భాగస్వాములయ్యారు.  

దీప ప్రజ్వలనపై  à°¸à±à°µà°¾à°®à°¿à°œà°¿ సందేశం.  :. . .

దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉన్న సమయంలో ప్రజల మనస్సులో ఒక తెలియని ఆందోళన నెలకొంటుందని, దాన్ని

పోగొట్టి, దేశ ఐక్యతను చాటేవిధంగా దీప ప్రజ్వలన కార్యక్రమాన్ని కేవలం 9 నిమిషాల పాటు చెయ్యడం ద్వారా ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుంచి బాల్కనీ లేదా గుమ్మంలోకి వచ్చి

ప్రకృతి మాతను ప్రార్ధించడం ద్వారా ఒక ఆహ్లాదకరమైన భావన కలుగుతుందన్నారు. అదే సందర్భంలో ప్రకృతి లో సంభవించిన కలుషిత వాతావరణం ప్రభావంగా ఎన్నో రుగ్మతలు

కలుగుతున్నాయని, వాటిని తొలగించమని ప్రార్ధించవచ్చని లేదా స్వచ్ఛమైన గాలిని పీల్చుకునే విధంగా భావించి కొందరు, ఎవరికీ తోచిన విధంగా వారు భావించవచ్చన్నారు.

అయితే à°ˆ ప్రక్రియ మనుషుల్లో నెలకొన్న à°’à°• అసందిగ్ద వ్యధను తొలగించేందుకు చేస్తున్న à°’à°• ప్రక్రియ à°—à°¾ కూడా భావించవచ్చన్నారు. 

ఈ దీప ప్రజ్వలనతో మన జీవితాల్లో

మంచి జరగాలని, ప్రపంచాన్ని పట్టి పీడించిన వ్యధలు తొలిగిపోవాలని సంకేతం కూడా ఇచ్చినట్టవుతుందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన ఈ పిలుపు లో మంచి నే

చూడాలని, విపరీత భవనాలు చెయ్యడం సబబు కాదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam