DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆరోగ్య ప్రదాత ఆదిత్యుని అనుగ్రహానికై  సూర్యనమస్కారాలు

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 06, 2020 (డి ఎన్ ఎస్) : శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో

ఆదివారం ఉదయం 12 ద్వాదశ రూపాల్లో సూర్యనమస్కారాలు పూజలు జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని

అంటురోగాలు రాకుండా ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని పూజించడం జరిగిందన్నారు. సమస్త లోకానికి వెలుగు నిచ్చి, ఆరోగ్యాన్ని ప్రసాదించే వారే

సూర్యభగవానుడు అని వారు పేర్కొన్నారు. 12 ద్వాదశ రూపాల్లో స్వామి వారిని పూజించడం జరిగిందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం రుత్విజుల మద్యన రెండు మీటర్ల

దూరం ఉంచడం జరిగిందని చెప్పారు. కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండాలని, ప్రభుత్వ సూచనల మేరకు ఎవరు ఆలయానికి రావద్దని ఆలయంలో జరిగే కార్యక్రమాలు టీవీ ఛానల్ ల లో,

పత్రికల్లో చూసి స్వామి వారిని పూజించాలని ఆయన కోరారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam