DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపమాక వెంకన్నను దర్శనం లో తరించాం : తెలంగాణ వాటర్ బోర్డు చైర్మన్ 

విశాఖపట్నం, జులై 1 , 2018 (DNS ONLINE ): ఉపమాక వేంకటేశ్వర స్వామి వారిని  à°¦à°°à±à°¶à°¿à°‚à°šà°¡à°‚ పూర్వజన్మ సుకృతమని తెలంగాణా రాష్ట్ర వాటర్ రీసోర్సెస్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్

వి.ప్రకాశరావు అన్నారు. ఆదివారం విశాఖ జిల్లా ఉపమాక వెంకటేశ్వర స్వామిని దర్శించిన ప్రకాశరావు, స్వరూప దంపతులను ఆలయ ప్రధాన అర్చకుడు గొట్టుముక్కల

వరప్రసాదాచార్యులు, అర్చకులు సంకర్షణపల్లి కృష్ణమాచార్యులు వీరిని సాదరంగా ఆహ్వానించి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ విశేషాలను, స్వామి వారి వైభవం, లీలా

విశేషాలను తెలుసుకున్నారు. గతం లోనే ఈ ఆలయాన్ని దర్శనానికి రావాల్సియుందని, మరోక పర్యాయం ఈ ఆలయ దర్శనానికి వస్తామని తెలిపారు. ఈ ఆలయ వైభవాన్ని గతంలోనే ఎందరో

చెప్పగా విన్నామని, ప్రస్తుతం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నామన్నారు. వీరి గోత్ర నామాలతో ఆలయంలో స్వామివారి ఉత్సవమూర్తులు వద్ద అష్టోత్తర పూజలు నిర్వహించారు.

అనంతరం ఆస్థాన మండపంలో స్వామి వారి క్షేత్ర విశేషాలను వారు అడిగి తెలుసుకున్నారు. తమకు ప్రాంతీయ భేదాలు లేవని, ఆంధ్ర ప్రదేశ్ లోని ఎన్నో ప్రాచీన, ప్రాధాన్యతమైన

ఆలయాలు ఉన్నాయని, వాటిని తెలుగువారు అందరూ దర్శించవలసిన అవసరం ఉందన్నారు. ప్రాంతీయ భేదాలు లేకుండా, తెలుగు రాష్ట్రాల ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఇరు

ప్రాంతాలూ అభ్యున్నతి లోకి రావాలని స్వామిని ప్రార్ధించినట్టు తెలిపారు. అర్చకులు వీరి దంపతులకు ఆశీర్వాదాలు స్వామి వారి చిత్రపటం, ప్రసాదములు అందజేశారు.  à°µà±€à°°à°¿

వెంట ఉపమాక గ్రామం ఎం.పి.టి.సి. కొప్పిశెట్టి హరిబాబు, ఉపమాక గ్రామానికి చెందిన ఇల్లింద రామానుజాచార్యులు దంపతులు, అర్చకులు నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాసులు,

బి.ఎస్.గోపాలాచార్యులు,సిబ్బంది గొర్ల గోవింద్,నమ్మి అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam