DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బాలిక సంరక్షణా కేంద్రాలలో మరింత శ్రద్ధ వహించండి: జయ లక్ష్మి

(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 06, 2020 (డి ఎన్ ఎస్) : బాలిక సంరక్షణా కేంద్రాలలో మరింత శ్రద్ధ వహించాలని శ్రీకాకుళం జిల్లా

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. జయ లక్ష్మి సూచించారు. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి గ్రామం లోని బాల సదన్, శిశు గ్రహాలను ఆమె సోమవారం సందర్శించారు. ఈ

సందర్బంగా అక్కడ అందుబాటులో ఉన్న వసతులను ఆశ్రయం పొందుతున్న బాలికలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎం. బబిత ఆదేశాల మేరకు ఈ పర్యటన

జరుపుతున్నట్టు తెలియచేసారు. ప్రస్తుతం కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నందున  à°¬à°¾à°² సదన్ కేంద్రాల్లో నివాసం ఉన్నవారి à°•à°¿ మరింత పౌష్టిక

 à°†à°¹à°¾à°°à°¾à°¨à±à°¨à°¿ అందించడం తో పాటు, సత్వర వైద్య సదుపాయాన్ని కూడా అందించాలన్నారు. ప్రతి ఒక్కరికి మాస్క్ లు, శానిటైజర్లు, అందించినట్టు తెలుసుకున్నారు. జిల్లా బాలల

సంక్షేమ, సంరక్షణ అధికారి, కెవి రమణ ద్వారా బాలికలకు అందిస్తున్న సదుపాయాలని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం

చేసారు. ఆ సమీపంలోనే ఉన్న శిశు గృహాన్ని కూడా సందర్శించారు. శిశు కేంద్రం మేనేజర్ నరేష్ ను అడిగి ఆశ్రయం లో ఉన్న వారు ఎవరైనా అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారో

లేదో తెలుసుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam