DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ కార్పొరేషన్  పింఛన్ బకాయిలు విడుదల చెయ్యాలి

*పేద బ్రాహ్మణులు ఆకలి తో ఉన్నారు - ఆదరించి ఆదుకోండి.*  

*బ్రాహ్మణా సమాఖ్య రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉదయకుమార్*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 07, 2020 (డిఎన్ఎస్) : రాష్ట్రం లో లాక్ డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి పనులు లేక, ఆదాయం లేక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నపేద

బ్రాహ్మణులకు 
ఇవ్వవలసిన బ్రాహ్మణ కార్పొరేషన్ పెన్షన్ బకాయిలు తక్షణం విడుదల చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య (ఏపీ బి ఎస్ఎస్ఎస్ ) రాష్ట్ర

సంయుక్త కార్యదర్శి వడ్డాది ఉదయకుమార్ కోరారు. ఈ మేరకు పేదలను ఆదుకోవాల్సిందిగా ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్, విజయవాడ సెంట్రల్ శాసన సభ్యులు

మల్లాది విష్ణు ను కోరినట్టు తెలిపారు. 
మంగళవారం విడుదల చేసిన లేఖలో ప్రస్తుత పరిస్థితులను వివరించారు. కార్పొరేషన్ ద్వారా వివిధ పథకాల్లో లబ్ది పొందుతున్న

వారిలో అధిక శాతం మంది ప్రయివేట్ దేవాలయాల్లో అర్చకులు గాను, పౌరోహిత్యం, జపతపాదులు చేస్తూ, చిన్న పాటు ఉపాధి పొందుతూ ఉన్నవారే అధికంగా ఉన్నారన్నారు. ప్రస్తుత

లాక్ డౌన్ పరిస్థితి లో వీళ్లంతా ఇళ్లకే పరిమితమైపోయారన్నారు. వీళ్ళలో చాలామందికి కార్యక్రమాలకు వెళితే తప్ప ఇల్లు గడవని స్థితి ఉందన్నారు. పైగా స్వతహాగా

బిడియం ఉండడం తో తమకు సహాయం చెయ్యమని కూడా ధైర్యంగా ముందు కు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. 

ప్రస్తుతం బకాయిలు ఉన్న పింఛన్లలో వృద్దులకు కశ్యప స్కీం,

దివ్యంగులకు పెంచను, విద్యార్థులకు గత ఏడాది ఇవ్వవలసిన భారతి స్కీం పధకాలు కూడా విడుదల కాలేదన్నారు. ప్రస్తుత పరిస్థితిలో బకాయిలు విడుదల చేసినట్టయితే ఈ గడ్డు

కాలం లో వీరికి కొంత ఆసరాగా ఉంటుందన్నారు.  

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో పేద బ్రాహ్మణులు ఆకలితో అలమటిస్తున్నారని వారికి వెంటనే కార్పొరేషన్ బకాయి

పడ్డ మూడు నెలల పింఛన్లు విడుదల చేసి ఆదుకోవాలని విజ్ఞప్తిచేశారు.

అదేవిధంగా కరోనా వల్ల ఉపాధి కోల్పోయిన అల్పాదాయ అర్చక పురోహితులను ఆర్థికంగా

ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. à°µà±€à°°à°¿à°¤à±‹ పాటు  à°­à°¾à°°à°¤à°¿ స్కీమ్ ద్వారా విద్యార్థులకు మంజూరైన ఉపకార వేతనాలు కూడా త్వరితగతిన వారి అకౌంట్లో జమ చేయాలని ఉదయ

కుమార్ విజ్ఞప్తి చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam