DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రక్తదాత . . . . స్ఫూర్తి దాత శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ డాక్టర్ నివాస్

*రక్త నిల్వలు నిండుకోరాదు, యువత అందుబాటులో ఉండాలి. . *.

*మేము సైతం . . .అంటూ పాత్రికేయులు కూడా. . .*

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). .

.*

శ్రీకాకుళం, ఏప్రిల్ 07, 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°ªà±à°°à°œà°¾ రక్షణే ధ్యేయంగా కార్యాచరణ చేస్తున్న శ్రీకాకుళం జిల్లా కలెక్టర్  à°…త్యంత విపత్కర పరిస్థితుల్లో సైతం స్వయంగా

రక్తదానం చేసి అందరికి స్ఫూర్తిదాతగా నిలిచారు. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రెడ్ క్రాస్ రక్త సేకరణ కేంద్రానికి నేరుగా వచ్చి రక్త

దానం నిర్వహించి ఆదర్శప్రాయంగా నిలిచారు. స్వయంగా ఆయన వైద్యులు కావడంతో రక్తదానం చెయ్యడం à°Žà°‚à°¤ అవసరమో అందరికీ తెలియచేసారు. 
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

ప్రస్తుతం కరోనా మహమ్మారి రాక్షసుని బారి నుంచి ప్రజలందరూ రక్షించబడాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యాచరణ నేపథ్యంలో జిల్లాలో ప్రస్తుతం కేవలం 38

యూనిట్ల రక్త నిల్వలు ఉండటం వలన వివిధ రక్త బ్యాంకు ల్లో రక్త నిల్వలు నిండుకోరాదని సూచించారు. ప్రధానంగా యువత అందుబాటులో ఉండాలని, అవకాశం ఉన్నవారంతా రక్తదానం

చేసి అవసరమైన వారికి రక్తం తక్షణం లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.   
ప్రస్తుతం జిల్లాలో రక్త యూనిట్ల నిల్వలు తగ్గిపోతున్నాయని,  à°•à°°à±‹à°¨à°¾ మహమ్మారి సమయంలో

రక్త నిల్వలు తగ్గిపోవడం కొంత ఆందోళన కలిగించే విషయం అన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ ఇప్పటి వరకు కరోనా మహమ్మారి ఛాయలు కనిపించకపోవడం సంతోషించదగిన విషయమే అయినప్పటికి

ఎటువంటి పరిస్ధితినైనా ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో రక్త నిల్వలపై కూడా దృష్టి సారించాలన్నారు.

కరోనా వ్యాప్తి నివారణ కార్యక్రమంలో

ప్రణాళికలు సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్నప్పటికి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కర్తవ్య నిర్వహణకు పూనుకున్నారు.  

జిల్లాలో రక్త నిల్వలు తగ్గుముఖం పట్టడం

జరుగుతోందని కలెక్టర్ నివాస్ అన్నారు. రక్త నిల్వలు పెంచాలని పిలుపునిచ్చారు. రోజు వారీ వైద్య చికిత్సల కార్యక్రమానికి కూడా కొరత ఏర్పడటం వలన ప్రాణాలు

కాపాడుకోలేని అవకాశం ఉంటుందని అన్నారు. ఈ క్రమంలో భాగంగా రక్త నిల్వలు పెంచాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పారు. ప్రతి రోజు ఉద్యోగులు రక్త దానం చేయుటకు చర్యలు

చేపడతామని అన్నారు. à°ˆ మేరకు అన్ని శాఖలకు సూచనలు ఇస్తామని పేర్కొన్నారు. 

మేము సైతం :  à°œà°¿à°²à±à°²à°¾ కలెక్టర్ స్వయంగా రక్తదానం చేయడంతో మేము సైతం అంటూ జర్నలిస్టుల

తరపున జెకెసి సీనియర్ పాత్రికేయులు à°Žà°‚.వి.ఎస్.ఎస్.శాస్త్రి రక్తదానం చేసి ఆదర్శప్రాయంగా నిలిచారు. 

గుడ్ ఫ్రైడే ఇంటి వద్దనే : గుడ్ ఫ్రైడ్ ఇంటి వద్దనే

నిర్వహించుకోవాలని జిల్లాకలెక్టర్ పిలుపునిచ్చారు. చర్చిలకు వెళ్ళ వద్దని, ర్యాలీలు నిర్వహించరాదని ఆయన కోరారు. ఇటీవల ఉగాది, శ్రీరామ నవమి అందరూ ఇళ్ళ వద్దనే

నిర్వహించుకున్నారని అదేవిధంగా గుడ్ ఫ్రైడేను నిర్వహించుకోవాలని పేర్కొన్నారు. 

కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా లాక్ డౌన్ ఉందని, 144వ సెక్షన్ అమలులో ఉందని

పేర్కొంటూ ప్రతి ఒక్కరూ ఇళ్ళలోనే ఉండాలని, కనీస దూరం పాటించాలని ఆయన కోరారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన అన్నారు. 
    à°…నంతరం

పేదలకు రెడ్ క్రాస్ సంస్ధ తరపున నిత్యావసర సరుకులను జిల్లా కలెక్టర్ పంపిణీ చేసారు. 
    à°ˆ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు,

రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, తహశీల్దారు దిలీప్ చక్రవర్తి, రెడ్ క్రాస్ సభ్యులు గీతా శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam