DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కరోనా కట్టడికి క్లిష్టమైన మహా సౌర, అరుణ హోమాలు

*14à°¨ ఆదిత్యుని క్షీరాభిషేకం, ఎవరికీ అనుమతి లేదు: .*  

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 12, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా మహమ్మారి

రాక్షసుణ్ణి అరికట్టడానికి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో మహా సౌర, అరుణ హోమాలు ఆదివారం మొదలు పెట్టినట్టు సహాయ కమిషనర్ మరియు

కార్యనిర్వాహణాధికారి వి హరి సూర్య ప్రకాష్ తెలిపారు. సమస్త జగతికి ఆరోగ్యాన్ని ప్రసాదించే సూర్య భగవానుడు చెంతన మహా సౌరవం, త్రిచ, అరుణం మూడు ఉపనిషత్తుల తో సూర్య

నమస్కారాలు జరుపుతామని అన్నారు. అలాగే మహా సౌర, అరుణ హోమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య ప్రదాత ఆదిత్యుడు కనుక స్వామివారికి ప్రత్యేక పూజలు జరుపుతామని

అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసారం ఈ ప్రత్యేక పూజలకు భక్తులు ఎవరినీ అనుమతించడం లేదని స్పష్టం చేశారు.


14న ఆదిత్యుని క్షీరాభిషేకం, ఎవరికీ

అనుమతి లేదు: . . .  

         à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి à°ˆ నెల 14à°¨ క్షీరాభిషేకం జరుగుతుందని సహాయ కమిషనర్ మరియు

కార్యనిర్వహణాధికారి వి హరి సూర్య ప్రకాష్ గారు తెలిపారు. కేంద్ర రాష్ట్రాలు ఆదేశాల మేరకు ఈ అభిషేక సేవకు ఎవరిని అనుమతించడం లేదని పేర్కొన్నారు. అలాగే టికెట్లు

కూడా విక్రయాలు నిలుపుదల చేశామని... ఇప్పటికే తీసుకున్న వారు ఈ సేవకు రావద్దు అని ఆయన స్పష్టం చేశారు.
       à°†à°²à°¯ ప్రధాన అర్చకులు గారు శంకర శర్మ గారు మాట్లాడుతూ మేష

సంక్రమణం (విష్ణువత్ పుణ్యకాలం) చైత్ర బహుళ సప్తమి సందర్భంగా మంగళవారం ఉదయం నాలుగు గంటలకు స్వామివారి అభిషేకం జరిపిస్తామని అన్నారు. పాలు పెరుగు తేనె పంచదార

నెయ్యి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి క్షీరాభిషేకం వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. అలాగే ఈ సేవకు భక్తులను అనుమతించడం లేదని కేవలం తక్కువ మంది

అర్చకులు, వైదిక సిబ్బంది మాత్రమే హాజరు అవుతారని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్య ప్రదాత అయిన శ్రీ సూర్యనారాయణ స్వామివారిని ఆరోజు భక్తులంతా ఉదయం స్వామివారికి

ప్రీతి అయిన క్షీరాన్నం వండి నైవేద్యం చూపి కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండాలని స్వామివారికి నమస్కరించాలని ఆయన కోరారు.

ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర

శర్మ గారి ఆధ్వర్యంలో ని అర్చక బృందం మహా సౌరం, త్రిచ, అరుణం మూడు ఉపనిషత్తులలో సూర్య నమస్కారాలు, మహా సౌర, అరుణ హోమం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam