DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒకణ్ణి సూట్ కేసు లో మడత పెట్టి. . రవాణా., వ్యక్తి అరెస్ట్ 

*మంగుళూరు లో సూట్ కేస్ రవాణా సంచలనం, * 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి, ఏప్రిల్ 13, 2020 (డి ఎన్ ఎస్) : కరోనా కట్టడి ప్రభావానికి

కొత్తకొత్త విషయాలని ఈ ప్రపంచం చవి చూస్తోంది. గత మూడు వారాలుగా దేశమంతా లాక్ డౌన్ లో ఉన్నందున వీటిని తుంగలోకి తొక్కేందుకు కొత్త కొత్త పధకాలు అమలు

చేస్తున్నారు. దీనిలో భాగమే మంగుళూరు లోని ఒక వ్యక్తి తమ మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకు వచ్చేందుకు ఒక సూట్ కేసు ను ఉపయోగించాడు. వివరాల్లోకి వెళితే. . .లాక్ డౌన్

నేపథ్యంలో కొత్తవారిని తమ ఊళ్లలోకి.. అపార్టుమెంట్లలోకి.. గేటెడ్ కమ్యునిటీలోకి అనుమతించని వైనం తెలిసిందే. మంగళూరులోని అర్యసమాజ్ రోడ్డు లో ఒక అపార్టుమెంట్

ఉంది. అందులోకి బయటవారిని లోపలకు అనుమతించకూడదన్న నిబంధనను పెట్టుకున్నారు. అయితే.. ఇందులో ఉండే ఒక యువకుడు లాక్ డౌన్ కారణంగా ఒక్కడే ఉండలేక పోయాడు. విపరీతమైన

బోర్ కు గురి అవుతున్న పరిస్థితి. దీంతో.. భారీ ప్లాన్ వేశాడు.

తనకు ఆప్తుడైన మిత్రుడ్ని తన ఫ్లాట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా భారీ సూట్

కేసులో అతడ్ని దాచేసి కారులో తీసుకొచ్చాడు. అపార్ట్ మెంట్లోకి భారీ సూట్ కేసుతో వచ్చిన అతడ్ని అనుమానించిన అపార్టుమెంట్ వాసులు.. దాన్ని తెరవాలని కోరారు.

అందుకు నో చెప్పటంతో మరింత అనుమానానికి గురయ్యారు. ఒత్తిడి మేరకు సూట్ కేసు తెరిచి చూస్తే.. అందులో స్నేహితుడ్ని రహస్యంగా తీసుకొస్తున్న వైనాన్ని గుర్తించారు. ఈ

ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది. కరోనా వేళ ఇలాంటి దరిద్రపుగొట్టు ఎత్తులు వేయాల్సిన అవసరం ఉందా? అన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. స్నేహితుడ్ని రహస్యంగా

తీసుకొచ్చిన వైనంపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam