DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మందుల విక్రయాల వివరాలు చెప్పండి: కలెక్టర్ నివాస్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 13, 2020 (డి ఎన్ ఎస్) : శ్రీకాకుళం జిల్లాలోని మెడికల్ షాపుల్లో ప్రతిరోజూ జరిగే మందుల విక్రయాల

వివరాలు ఎప్పటికప్పుడు సమర్పించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ డ్రగ్స్ అసోసియేషన్ ను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో డ్రగ్స్ అసోసియేషన్ సభ్యులతో సోమవారం

సమావేశం జరిగింది. కలెక్టర్ నివాస్ మాట్లాడుతూ మందుల దుకాణాలలో వైద్యుల సూచనల మేరకు మాత్రమే విక్రయాలు జరగాలని పేర్కొన్నారు. ఏరిత్రోమైసీన్, పారాసెటిమాల్,

బెనడ్రిల్ వంటి జ్వరం, దగ్గు, గొంతు నొప్పి తదితర రుగ్మతల మందులు, ఏంటి బయాటిక్ విక్రయాల వివరాలు సమర్పించాలని చెప్పారు. నిర్దేశిత యాప్ లో అప్ లోడ్ చేయాలని స్పష్టం

చేసారు. మండలల వారీగా ఉన్న మందుల దుకాణాల జాబితా సమర్పించాలని ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని స్పష్టం చేసారు. కరోనా

వ్యాప్తి చెందకుండా జిల్లా యంత్రాంగం అవిశ్రాంతంగా పోరాటం చేస్తుందని, దానికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో

సంబంధించిన వివరాలు తీసుకుంటున్నామని అన్నారు. కరోనా లక్షణాలు ఉన్న ఏ వ్యక్తి వివరాలు ఉన్నా వెంటనే సమాచారం అందించి కరోనా రహిత జిల్లా గా ఉండుటకు తోడ్పాటును

అందించాలని అన్నారు. 

ఈ సమావేశంలో ఐటిడిఏ పిఓ సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ, డ్రగ్స్ కంట్రోల్ సి.హెచ్.కిరణ్ కుమార్, డ్రగ్స్ అసోసియేషన్

అధ్యక్షులు కరుణ్ కుమార్ గుప్తా, ఉపాధ్యక్షులు రాజేంద్రప్రసాద్, కార్యదర్శి మణి రాజు, కోశాధికారి మురళీ క్రిష్ణ, జాయింట్ సెక్రటరీ శ్రీనివాసరావు తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam