DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోలీసు సిబ్బంది పిల్లలు విజేతలు గా నిలవాలి : ఎస్ పీ రాహుల్ దేవ్ శర్మ 

విశాఖపట్నం, జులై 2 , 2018 (DNS Online ): గత ఏడాది పడవ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 31 మంది పోలీసు సిబ్బంది పిల్లలకు విశాఖ జిల్లా ఎస్ పీ రాహుల్ దేవ్ శర్మ నగదు

పురస్కారం అందించారు. సోమవారం నగరం లోని కైలాసాగిరి వద్ద గల ఆర్మ్డ్ రిజర్వ్ హెడ్ క్వార్టర్స్ లో జరిగిన కార్యక్రమం లో అయన ముఖ్య అతిధి గా పాల్గొని, చిన్నారిని

ఆశీర్వదించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో ధీటుగా పోటీపడి, మంచి ఫలితాలు సాధించిన చిన్నారులు, ఉన్నత విద్యలను అభ్యసించి దేశం మెచ్చిన భావి భారత

పౌరులుగా తయారవ్వాలని పిలుపునిచ్చారు. అనంతరం వారితో మాట్లాడి, ఉత్తేజ పరిచి, వారిలో స్ఫూర్తిని కల్గించారు. తదుపరి పోలీసు విభాగం లో విధులు నిర్వహించి పదవి విరమణ

చేసిన వారిని సత్కరించారు. మూడు దశాబ్దాలకు పైబడి వీరంతా పోలీసు శాఖకు సేవ చేశారన్నారు. విధి నిర్వహణలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఉద్యోగ బాధ్యతలను

విజయవంతంగా చేయడం చాలా గొప్ప విషయం అన్నారు. పోలీసుశాఖలో చిన్న ఉద్యోగంతో జీవితం ప్రారంభించి ఉన్నత ఉద్యోగం వరకు ఎదగడం హర్షణీయమన్నారు. పదవీ విరమణ పొందాక

అందాల్సిన ప్రయోజనాలైన పెన్షన్ , భద్రత, జి.పి.ఎఫ్ , తదితరాలు సకాలంలో అందేలా చర్యలు తీసుకున్నారని చెప్పేరు.  à°¶à±‡à°· జీవితంలో సంతోషంగా జీవించేలా వాకింగ్ , తదితర

అలవాట్లను పాటించాలన్నారు. ఇష్టం ఉంటే ఉద్యోగం కూడా చేయవచ్చన్నారు.పిల్లల భవిష్యత్తుకు రాబోయే పది సంవత్సరాలు వరకు మంచి ప్రణాళికలు సిద్ధం చేసి పిల్లల

భవిష్యత్తు తీర్చిదిద్దాలన్నారు. 

ఈ కార్యక్రమంలో భాగంగా అనారోగ్య కారణాలతో మరియు ప్రమాదవశాత్తు మరణించిన పోలీసుల కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష

రూపాయలు చొప్పున నగదు చెక్కులను విశాఖపట్నం జిల్లా పోలీసు అధికారుల సంఘం తరపు పంపిణీ చేశారు.  à°ˆ కార్యక్రమంలో ఎల్ మోహన్ రావు,  à°¸à°¿à°¹à±†à°šà± వివేకానంద ఎస్సీ ఎస్టీ సెల్

à°¡à°¿.ఎస్.పి  à°µà±†à°‚à°•à°Ÿ రావు,  à°‡à°¨à±à°¸à±à°ªà±†à°•à±à°Ÿà°°à± ఎస్బిఐ  à°ªà°¿.నాగేశ్వరరావు, ఎల్ మన్మధరావు రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ , ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులు సంఘం, విశాఖపట్నం జిల్లా

పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జె.వీ.ఆర్.ఎస్.సుబ్బరాజు మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు ఏ.ఆర్ సిబ్బంది,  à°•à±à°Ÿà±à°‚బల  à°¸à°­à±à°¯à±à°²à±, తదితరులు పాల్గొన్నారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam