DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యవసర ప్రయాణాలకు పోలీసు అనుమతులు: ఎస్పీ అమ్మిరెడ్డి 

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు  SV, బ్యూరో , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 13, 2020 (డి ఎన్ ఎస్) : కరోన వైరస్ (Covid-19) నేపద్యములో శ్రీకాకుళం జిల్లా లో పటిష్టంగా లాక్ డౌన్ అమలు

జరుగుతున్నందున దృష్ట్యా జిల్లా ప్రజలు  à°à°¦à±ˆà°¨à°¾ అత్యవసర ప్రయాణాలు చెయ్యవలసి వస్తే అనుమతి ఇవ్వనున్నట్టు జిల్లా ఎస్పీ ఆర్ à°Žà°‚ అమ్మిరెడ్డి à°“ ప్రకటనలో తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన వారు నిర్ణిత దరఖాస్తు లో తమ పూర్తి వివరాలు నింపి జిల్లా ఎస్పీ కార్యాలయానికి పంపాలన్నారు. 

వివరాలు

పంపవలసిన వాట్సాప్ నెంబర్:  6309990933 కు లేదా  Official mail id : dail100srikakulam@gmail.com .  

దరఖాస్తు లో తమ పేరు, వివరాలను తెలియచేస్తూ చేరవలసిన గమ్య స్థానాన్ని వివరం తో పాటు, వాహనం లో ఎంతమంది

ప్రయాణిస్తున్నారో కూడా తెలియచేయాలన్నారు. వివరాలన్నీ పరిశీలించిన తర్వాత నేరుగా దరఖాస్తు దారుని ఫోన్ కి వాట్సాప్ సందేశం నేరుగా ఎస్పీ కార్యాలయం నుంచే

వస్తుందని, à°† సందేశం మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు. దాన్ని ఇతర ఫోన్ కు ఫార్వార్డ్ చేస్తే అనుమతించబడదన్నారు. 

దరఖాస్తు దారు నింపవలసిన వివరాలు:

1 .

పేరు: . . .   
2 . ఫోన్ నెంబర్  : . . .   
3 . మీ ఆధార్ నెంబర్ :   
4 . మీరు ఉంటున్న పోలీస్ స్టేషన్ పరిధి :  
5 . వెళ్లే వారి పేరు వివరాలు : 
6 . దరఖాస్తు పెట్టిన వారితో బంధుత్వం : 
7 .

డ్రైవర్ పేరు:    
8 . లైసెన్స్ నెంబర్ : 
9 . వాహనం నెంబర్ : 
10 . ఎక్కడి నుంచి ఎక్కడకు ఏ రహదారి మీదుగా వెళ్తుంది : 
11 . ఎందుకోసం వెళ్తున్నారు : 
12 . ఎన్ని రోజులు అనుమతి

కావాలి : 

ఇలా వచ్చిన దరఖాస్తు ను క్షుణ్ణంగా పరిశీలించి సదరు అత్యవసర వాహన కదలికలు జరుపుటకు à°—à°² కారణం లను పరిశించిన అనంతరం  à°œà°¿à°²à±à°²à°¾ పోలీసు యంత్రాంగం తగు

వెహికల్ పాస్ జారీ చేయడం జరుగుతుంది. కావున ప్రజలు అత్యవసర సమయములో ఈ అవకాశమును సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam