DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డెలివరీ సమయం అయినా సరే. .  డ్యూటీ యే ముందు

*ఎందరో మహానుభావులు. .అందరూ కరోనా విధుల్లోనే . .* 

*7 నెలల గర్భిణీతో డాక్టర్, నెల బాలింత à°—à°¾ à°à°à°Žà°¸à± అధికారి* 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.

విశాఖపట్నం, ఏప్రిల్ 16, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుణ్ణి ప్రభావం తో ప్రపంచం వణికి పోతుంటే. . . ఎందరో మహానుభావులు తమ సేవల ద్వారా కోట్లాదిమందికి స్ఫూర్తి

దాతలుగా నిలుస్తున్నారు. వారిలో ఐఏఎస్ అధికారిణులు, వైద్యులు, స్వచ్చంద సేవకులు, ఎందరో ఉన్నారు. 

à°ˆ ఐఏఎస్  à°…ధికారిణి అందరికీ ఆదర్శమే:. . .

డాక్టర్ జి. సృజన, ఐ

ఏ ఎస్ :.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ à°—à°¾ విధులు నిర్వహిస్తున్నారు. కరోనా మహమ్మారి విస్తృతం అవుతున్న తరుణంలోనే ఈమె 9 నెలల

ప్రగ్నెంట్ గా ఉండి కూడా ఆసుపత్రిలో చేరడానికి ముందు రోజు వరకూ కరోనా విధుల్లోనే దిగ్విజయంగా సేవలు అందించారు. మార్చి నెలలో ఒక మగ బిడ్డకు జన్మ నిచ్చారు.

అనంతరం ఆరు నెలల కాలం ప్రసూతి సెలవు తీసుకునే అవకాశం ఉన్నా కూడా ఆమె కేవలం నెలరోజులకు విధుల్లో చేరిపోయారు. అందరూ వారించినా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు

సేవలు అందించడం లో తమ విద్యుక్త ధర్మాన్ని దిగ్విజయంగా నెరవేరుస్తున్నారు. మధ్యలో ఒకరోజు తన చిన్నారి శిశువు ఎత్తుకుని తన కార్యాలయం నుంచే క్రింది స్థాయి

ఉద్యోగులతో సమావేశాలు, సమీక్షలు సైతం నిర్వహించారు. ఈమె ధైర్యానికి, స్ఫూర్తికి విశాఖ నగర ప్రజలే కాదు యావత్ భారత దేశం అభినందనలతో ముంచెత్తుతోంది. ఈమె కూడా

డాక్టర్ కావడం గమనార్హం.

మరొక యువ మహిళా వైద్యురాలు: . . .

మరొక నగరంలో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న వారిలో ఒక మహిళా 7 నెలల గర్భిణీ కూడా ఉండడం

గమనార్హం. ఒక వైద్యురాలిగా తాము యే పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తున్నామో తెలిసి కూడా ఈమె బాధితులకు, వ్యాధిగ్రస్తులకు కీలకమైన సేవలు అందించడం సర్వత్రా

ఆశ్చర్యాన్ని కల్గిస్తోంది. ఇప్పడికే ఎందరికో ఆరోగ్య ప్రదాతగా నిలిచింది. వీరి సంరక్షణలో చాలామంది వ్యాధి నుంచి కోలుకుని సురక్షితంగా వారి ఇళ్లకు

చేరుకున్నారు. ఈమె వయసులో కూడా చాలా మంది వైద్యుల కంటే చిన్నవారు కావడం గమనార్హం. 

ఇలాంటి వాళ్ళెందరో ప్రజా శ్రేయస్సు కోసం ఇల్లు వీడి తమ భాద్యతలను శతశాతం

నెరవేరుస్తున్నారు. వీళ్లందరి శ్రమ పూర్తిగా ఫలించాలి అంటే ప్రజలు కూడా వారి భాద్యతలను నెరవేర్చి, లాక్ డౌన్ సమయంలో ఇళ్లలోనే ఉండాల్సిన అవసరం ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam