DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాయకరావు పేట నుంచి ఆనందపురం వరకూ పటిష్ట భద్రతా 

*ఒక్క రోజులో 2194 కేసులు - రూ. 10.51 లక్షల ఫైన్ వసూలు:*    

*అత్యవసర కేసుల్లోనే అనుమతులు ఇస్తాం :విశాఖ ఎస్పీ బాపూజీ * 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). .

.

విశాఖపట్నం, ఏప్రిల్ 17, 2020 (డిఎన్ఎస్) : విశాఖ జిల్లా పరిధిలో 24  à°—ంటల్లో 2194 కేసులకు గాను, రూ. 10,51,375 లను అపరాధ రుసుముగా వసూలు చేసినట్టు విశాఖపట్నం జిల్లా ఎస్పీ అట్టాడ

బాపూజీ తెలిపారు. గురువారం సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² నుంచి శుక్రవారం సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² వరకూ జరిపిన తనిఖీల్లో 2194 కేసులు నమోదు చేశామన్నారు.   లాక్ డౌన్ సందర్బంగా జిల్లాలో

అన్ని చెక్ పోస్ట్ ల్లోనూ అత్యంత కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, అనకాపల్లి, కశింకోట, నక్కపల్లి, పాయకరావు పేట, వై జంక్షన్, అడ్డురోడ్డు జంక్షన్, అనకాపల్లి టౌన్,

వెంకన్న పాలెం, చోడవరం, దేవరపల్లి, ఆనందపురం, కోటపాడు జంక్షన్, సబ్బవరం జంక్షన్ ల్లో విస్తృత తనిఖీలు జరుపుతున్నట్టు తెలియచేసారు. 

ఒక్క రోజు లాక్ డౌన్ నియమ

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 127 కేసులు, ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు 2067 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. అదే విధంగా 54 వాహనాలను స్వాధీనం చేసుకుని, 155 మందిని అదుపులోకి

తీసుకున్నామన్నారు. 

వారి పై 1279 కేసులు నమోదు చేసి,  à°°à±‚. 5,91,220  à°œà°°à°¿à°®à°¾à°¨à°¾ వసూలు చేశామని  à°µà°¿à°¶à°¾à°–పట్నం జిల్లా ఎస్పీ అట్టాడ బాపూజీ తెలిపారు. విశాఖ జిల్లా ప్రధానంగా

అనకాపల్లి, ఏజెన్సీ ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతోందని, అనవసరం గా రోడ్ల పైకి వచ్చే వారికి అవగాహనా కల్పించి, తదుపరి కేసు నమోదు చెయ్యడం

జరుగుతోందన్నారు. బుధవారం సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² నుంచి గురువారం సాయంత్రం 6 à°—à°‚à°Ÿà°² వరకూ జరిపిన తనిఖీల్లో 1279 కేసులు నమోదు చేశామన్నారు.  

అత్యవసర కేసుల్లోనే అనుమతులు: . .

వైద్య పరంగా, ఇతర  à°…త్యవసర పరిస్థితులు తలెత్తిన సమయాల్లోనే ప్రయాణాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని డిఐజి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో అనుమతులు

ఇవ్వవచ్చని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌరవ గౌతమ్ సవాంగ్  à°†à°¦à±‡à°¶à°¾à°²à± జారీచేశారన్నారు. à°ˆ విశాఖపట్నం పరిధిలో అనుమతులు కావాల్సిన వారు తమ కార్యాలయాన్ని

సంప్రదించాలన్నారు. 

 à°µà°¿à°µà°°à°¾à°²à°¨à±à°¨à±€ పరిశీలించిన తర్వాత నేరుగా దరఖాస్తు దారుని ఫోన్ à°•à°¿ వాట్సాప్ సందేశం నేరుగా ఎస్పీ కార్యాలయం నుంచే వస్తుందని, à°† సందేశం

మాత్రమే చెల్లుబాటు అవుతుందన్నారు. దాన్ని ఇతర ఫోన్ కు ఫార్వార్డ్ చేస్తే అనుమతించబడదన్నారు. 

దరఖాస్తు దారు నింపవలసిన వివరాలు:. . .
1 . పేరు: . . .   
2 . ఫోన్ నెంబర్  : . . .

  
3 . మీ ఆధార్ నెంబర్ :   
4 . మీరు ఉంటున్న పోలీస్ స్టేషన్ పరిధి :  
5 . వెళ్లే వారి పేరు వివరాలు : 
6 . దరఖాస్తు పెట్టిన వారితో బంధుత్వం : 
7 . డ్రైవర్ పేరు:    
8 . లైసెన్స్

నెంబర్ : 
9 . వాహనం నెంబర్ : 
10 . ఎక్కడి నుంచి ఎక్కడకు ఏ రహదారి మీదుగా వెళ్తుంది : 
11 . ఇందుకోసం వెళ్తున్నారు : 
12 . ఎన్ని రోజులు అనుమతి కావాలి : 

ఈ వివరాలతో కూడిన

దరఖాస్తు ను ఆయా జిల్లాల ఎస్పీ కార్యాలయానికి పంపాల్సిందిగా సూచించారు. à°† జిల్లా à°² ఎస్పీ వాట్సాప్ , à°ˆ మెయిల్ వివరాలను అయన విడుదల చేసారు. 

విశాఖపట్నం జిల్లాలో

దరఖాస్తు చెయ్య వలసిన వివరాలు :. . .

విశాఖపట్నం ఎస్పీ  à°µà°¾à°Ÿà±à°¸à°¾à°ªà± : +91 95052 00100 ,  à°°à±†à°‚à°¡à°µ నెంబర్:  +91 94409 04229 . 

విశాఖపట్నం ఎస్పీ కార్యాలయం  à°ˆà°®à±†à°¯à°¿à°²à±:  commandcontrolvspr@gmail.com.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam