DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అనుమతి పొందిన పరిశ్రమలే నిర్వహించాలి : కలెక్టర్

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 19, 2020 (డిఎన్ఎస్) : గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న పరిశ్రమలు అనుమతి పొందిన  à°¤à°°à±à°µà°¾à°¤

మాత్రమే నడపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ స్పష్టం చారు. ఆది వారం ఒక ప్రకటన విడుదల చేస్తూ గ్రామీణ ప్రాంతంలో పనిచేస్తున్న పరిశ్రమలు ఏప్రిల్ 20వ తేది

నుండి నడుపుటకు తహశీల్దార్లకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేయాలని తెలిపారు. తహశీల్దారు నుండి అనుమతి పొంది క్యూ ఆర్ కోడ్ వచ్చిన తరువాత మాత్రమే పరిశ్రమలు నడవాలని,

అనుమతి పొందకుండా నడిపే పరిశ్రమలపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు. 

పరిశ్రమల అప్రూవల్ ట్రాకింగ్ సిస్టమ్ http://industries.srikakulamcollectorate.in/ ద్వారా పర్యవేక్షణ

చేస్తామని తెలిపారు. à°ˆ లింకు ద్వారా దరఖాస్తు సమర్పించవచ్చని చెప్పారు.  à°¦à°°à°–ాస్తుతోపాటు  à°•à±à°°à°¿à°‚ది వివరాలు సమర్పించాలని కలెక్టర్ అన్నారు. 

1.  à°ªà°°à°¿à°¶à±à°°à°®à°² శాఖ

జారీ చేసిన రిజిస్ట్రేషన్ (ఉద్యోగ్ ఆధార్/ శాశ్వత రిజిస్ట్రేషన్/ ఐఇఎం/ లైసెన్స్)

2.  à°¸à°‚స్దలో మొత్తం సిబ్బంది వివరాలు.

3. పరిశ్రమలో పని చేయుటకు 50 శాతంకు

తగ్గించిన సిబ్బంది వివరాలు. (ఇతర మండలాలకు చెందిన సిబ్బందిని అనుమతించరు)

4. సిబ్బందికి సరఫరా చేసిన మాస్కులు (సరఫరా చేసిన మాస్కుల ఫోటోలు జత చేయాలి)

5.

సిబ్బందికి ఏర్పాటు చేసిన శానిటైజర్లు (ఏర్పాటు చేసిన శానిటైజర్ల ఫోటోలు జత చేయాలి)

6.  à°µà±à°¯à°•à±à°¤à±à°² మధ్య దూరాన్ని పాటిస్తూ తీసుకున్న చర్యలు (సంబంధిత ఫోటోలు జత

చేయాలి)
అనుమతి పొందుటకు తాహశీల్దార్ కార్యాలయానికి నేరుగా వెల్లరాదని ఆయన స్పష్టం చేసారు. కార్యాలయానికి నేరుగా వెళ్లే వారిపై న్యాయపరమైన చర్యలు చేపట్టడం

జరుగుతుందని పేర్కొన్నారు. తాహశీల్దారు తీసుకున్న నిర్ణయమే తుది నిర్ణయమని, దీనిపై ఎటువంటి అప్పీలు లేదని ఆయన అన్నారు. తాహశీల్దారు ఇచ్చే అనుమతి పత్రంపై బార్

కోడ్ ఇవ్వడం జరుగుతుందని దానిని ఆన్ లైన్ లో డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. బార్ కోడ్ ను పరిశ్రమ వద్ద ప్రదర్శించాలని కలెక్టర్ అన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam