DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాల వ్యాన్ లో ప్రయాణీకుల తరలింపు, వ్యక్తులు అరెస్ట్ 

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .

అమరావతి, ఏప్రిల్ 19, 2020 (డిఎన్ఎస్) : à°²à°¾à°•à± డౌన్ నిబంధనలను తుంగలోకి తొక్కుతూ పాల వ్యాన్ లో మనుషులను

తరలిస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు రూరల్ ఎస్పీ విజయ రావు తెలిపారు. కంటికి కునుకు లేకుండా ప్రజల ప్రాణాలను రక్షించుటయే ధ్యేయంగా పని

చేస్తున్న గుంటూరు రూరల్ పోలీస్ వారికి విధి నిర్వహణలో కొన్ని ఆశ్చర్యకరమైన  à°¸à°‚ఘటనలు ఎదురౌతున్నాయని తెలిపారు.

ఈ సందర్భముగా ఎస్పీ మాట్లాడుతూ కరోనా వైరస్

వ్యాప్తి నివారణ దృష్ట్యా లాక్ డౌన్ నిబంధనలను గుంటూరు రూరల్ పోలీస్ పటిష్టంగా అమలు చేస్తూ ఎక్కడికక్కడ  à°…ంతర్ జిల్లా మరియు అంతర్ రాష్ట్రీయ చెక్ పోస్టులను

ఏర్పాటు చేశామన్నారు. ఇతర జిల్లాలు మరియు రాష్ట్రాల నుండి ప్రజల రాక పోకలు నిషేధించిన వేళ కొంత మంది ప్రజలు లాక్ డౌన్ నిబంధనలను పట్టించు కోకుండా,తమ సొంత ఊర్లకు

వెళ్లాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు అని తెలిపారు.

సరిగ్గా అలాంటి సంఘటన ఆదివారం తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దు నందు గల పొందుగుల అంతర్ రాష్ట్ర

చెక్ పోస్టు నందు జరిగింది. హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా సింగరాయ కొండకు వెళ్తున్న ఒక కాళీ పాల వాహనంలో ముగ్గురు విద్యార్థులు నల్గొండ జిల్లా మిర్యాలగూడ

నుండి ప్రకాశం జిల్లా కారంపూడి వెళ్ళడానికి పాల వాహనము యొక్క డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి కాళీ పాల వాహనంలో కూర్చొని రహస్యముగా వస్తుండగా పోందుగుల అంత రాష్ట్ర

 à°šà±†à°•à± పోస్ట్ వద్ద పోలీస్ వారి వాహన తనిఖీలు చేస్తుండగా స్పెషల్ పార్టీ కానిస్టేబుళ్లకు చిక్కారు అని తెలిపారు. à°† ముగ్గురు విద్యార్థులను మరియు  à°²à°¾à°°à±€ డ్రైవర్ ను

పోలీస్ వారు అదుపులోనికి తీసుకుని పాల లారీని సీజ్ చేసి కేస్ కారడం జరిగినదని ఎస్పీ తెలిపారు.

ప్రభుత్వాలు మరియు పోలీస్ వారు కఠిన ఆంక్షలు విధించినప్పటికీ

కొంతమంది ప్రజల తీరు మారడం లేదు. కరోనా వైరస్ విస్తృతంగా భావిస్తున్నప్పటికీ తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా  à°²à°¾à°•à± డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ

చట్టవ్యతిరేకమైన చర్యలకు పాల్పడుతున్నారు.

ప్రజలు ఎవరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న లాక్ డౌన్  à°¨à°¿à°¬à°‚ధనలకు వ్యతిరేకంగా ఎటువంటి చట్టవిరుద్ధమైన

పనులకు పాల్పడి శిక్షార్హులు కావద్దని హెచ్చరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam