DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి : మంత్రి అయ్యన్న

విశాఖపట్నం, జులై 2 , 2018 (DNS Online ): వర్షాకాలం ప్రారంభమైనందున కీటక జనిత వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని రహదారులు భవనాల శాఖ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు

అధికారులు ప్రజాప్రతినిధుల ను ఆదేశించారు. సోమవారం ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పారిశుద్యం బావుండాలి అన్నారు

తాగునీటి శుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు వ్యాధుల పట్ల అవి రావడానికి గల కారణాలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. 2

మూడు రోజుల్లో గ్రామస్థాయిలో సమావేశం ఏర్పాటు చేసి సదస్సులు నిర్వహించాలన్నారు. 14 ,15 ఆర్థిక సంఘం నిధులు పుష్కలంగా ఉన్నాయని సర్పంచులు గ్రామాభివృద్ధి పై పూర్తి

దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. పంచాయతీరాజ్ మంత్రి లోకేష్ చిన్న గ్రామాలకు పెద్ద కానుకలను ఇచ్చారని చెప్తూ రెండు వేల కంటే తక్కువ జనాభా వున్న

గ్రామాల్లో 10 శాతం నిధులు పంచాయితీ పెట్టుకుంటే 90 శాతం నిధులను ఉపాధిహామీ నుండి మంజూరు చేస్తారని, 2000 పైబడిన జనాభా ఉన్న గ్రామాలకు 30 శాతం నిధులను ఇస్తే 70 శాతం నిధులను

ఉపాధి నిధుల నుండి అందిస్తారని చెప్పారు. ఈ అవకాశాన్ని చిన్న గ్రామాల వారందరూ వినియోగించుకోవాలన్నారు. రోడ్లు కాలువలు స్మశానాలు మొదలైనవన్నీ నిర్మించుకోవడం

మరిన్ని అభివృద్ధి పనులను చేసి సర్పంచులు ప్రజల ఆదరాభిమానాలను పొందాలని మంత్రి కో రారు.
నియోజకవర్గంలో20 పనులకు రూ.233 కోట్ల 70 లక్షలు మంజూరు చేసినందుకు మంత్రి

లోకేష్ కు అయ్యన్నపాత్రుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పనులలో ముఖ్యంగా భీమ బోయపాలెం గ్రామం నుండి కస్తూరిబా స్కూలుకు, ఎం జి ఆర్ పి అగ్రహారం రోడ్డు ఉన్నాయని ఇవన్నీ

అక్కడి ప్రజల చిరకాల కోరిక అని చెప్పారు.

మాకవరపాలెం లో బీసీ ఆశ్రమ పాఠశాల

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాకు 5 బీసీ ఆశ్రమ పాఠశాలలు మంజూరు చేయడం

పట్ల మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ జిల్లాలోని మాకవరపాలెం లో ఈ సంవత్సరం నుండి బీసీ బాలుర ఆశ్రమ పాఠశాల ఆరంభం అవుతుందని చెప్పారు. పది ఎకరాల స్థలంలో భవనాలు

నిర్మించేందుకు 35 కోట్లు మంజూరు చేశారని తెలిపారు.చోడవరం పాయకరావుపేట బాలికల ఆశ్రమ పాఠశాలలు పెద నరవ అనకాపల్లిలో బీసీ బాలుర పాఠశాలలో మంజూరయ్యాయని మంత్రి

తెలిపారు

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam