DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మరింత కఠినంగా లాక్ డౌన్ నిబంధలనలు అమలు: కలెక్టర్

*శ్రీకాకుళం జిల్లాకు 3 వేల రాపిడ్ టెస్ట్ కిట్లు చేరాయి : నివాస్*

*ఇకపై తుది పరీక్షలు కూడా శ్రీకాకుళం లోనే నిర్వహిస్తాం*

*మొత్తం సేకరించిన నమూనాలు 2808 ,1963

నెగటివ్ వచ్చాయి.*   

*జిల్లా లోని మండలాల మధ్య తిరగడం కూడా నిషేధమే. . . *

*జిల్లాలో పటిష్టమైన నిబంధనలు అమలు చేస్తున్నాం:  à°Žà°¸à±à°ªà±€ అమ్మిరెడ్డి* 

*(DNS

రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 20, 2020 (డిఎన్ఎస్) : శ్రీకాకుళం జిల్లా లో కరోనా మహమ్మారి కి సంబంధించి మొత్తం నమూనాలు : 2808

సేకరించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జె. నివాస్ తెలిపారు. సోమవారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రస్తుత పరిస్థితులను వివరించారు. ఈ

మొత్తం నివేదికల్లో వాటిల్లో  à°µà°¿à°¦à±‡à°¶à°¾à°² నుండి వచ్చిన వారు 1445 మంది కాగా, క్వారంటైన్ పరిధి 14 రోజులు పూర్తి చేసుకున్న వారు : 1439 మంది ఉన్నారన్నారు.  14 రోజులు లోపు : 6 మంది

ఉన్నట్టు తెలిపారు. మొత్తం నెగిటివ్ 1963 మందికి నెగటివ్ రిపోర్ట్ వచ్చిందని, ఇంకనూ మిగిలిన రావలసిన నివేదికలు 845 మంది పరీక్షల రిపోర్ట్ రావాల్సి ఉందన్నారు. కాగా

సోమవారం పరీక్షలకు పంపిన నమూనాలు 469 ఉన్నాయన్నారు. 

శ్రీకాకుళం జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు తప్పా, మిగతావారికి ఎటువంటి మినహాయింపు లేదని,

జిల్లాలో లాక్ డౌన్ యాధాతదంగా కొనసాగుతుందని జిల్లా కలెక్టర్ జె.నివాస్ స్పష్టం చేసారు.  à°—్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు తప్పా మిగతావాటికి ఎటువంటి మినహాయింపు

లేదని పేర్కొన్నారు. అంతర్ మండల కదలికలు కూడా నిషిద్ధం అని కలెక్టర్ ప్రకటించారు. మండల పరిధిలో కదలికలు గమనిస్తున్నామని చెప్పారు. 

వ్యవసాయం, చిరు

వ్యాపారులకు ఉదయం 6.00 గం.ల నుండి మధ్యాహ్నం 1.00గం. వరకు పంటలు విక్రయానికి అనుమతిని ఇస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మధ్యాహ్నం 1.00గం. తరువాత మండల ప్రజలు బయటకు రాకూడదని

పేర్కొన్నారు. మండల స్థాయిలో చెక్ పోస్ట్ ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. పరిశ్రమలు, అదే మండల ఉద్యోగులు విధులకు హాజరు కావాలని, ఆన్ లైన్ లో అనుమతి పొందిన

పరిశ్రమలు మాత్రమే నడుస్తాయని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ ఆహార పరిశ్రమలకు మాత్రమే అనుమతిఉందని చెప్పారు. వ్యక్తుల మధ్య దూరం తప్పనిసరిగా పాటించాలని,

సానిటైజర్లు, బ్లీచింగ్ చల్లడం వంటి అన్ని రకాల సురక్షిత చర్యలు చేపట్టాలని సూచించారు.

        జిల్లాకు 3 వేల రాపిడ్ టెస్ట్ కిట్స్ వచ్చాయని జిల్లా కలెక్టర్

చెప్పారు. వి.ఎల్.à°Žà°‚           లాబ్ లో టెస్టింగ్ ఏర్పాటుచేసామని, గుంటూరు నుండి రాజాం మండలం వచ్చిన వ్యక్తికి నిన్న పరీక్షలు చేసామని చెప్పారు. తుది టెస్టులు కొరకు

ఇప్పటి వరకు కాకినాడ పంపించేవారమని, ఇకపై రిమ్స్ లొనే టెస్టులు చేస్తామని కలెక్టర్ తెలిపారు.

వీధుల్లో ప్రజలు లాక్ డౌన్ పాటించడం లేదని, లాక్ డౌన్ లో ప్రజలు

సహకరించాలని, చెప్పారు. కరోనా లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా పరీక్షలు చేసుకోవాలని సూచించారు. ఇతర ప్రాంతాల నుండి ప్రజలు వస్తున్నారని, దానివలన  à°ªà±à°°à°®à°¾à°¦à°‚ పొంచి

ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.  à°®à±‡ 3 తరువాత కూడా అప్రమత్తంగా ఉండాలని, జిల్లా నుండి 2,460 నమూనాలు సేకరించామని, 1,741 నివేదికలు వచ్చాయని, ఇంకా 724 నివేదికలు రావాల్సి ఉందని

తెలిపారు. రోజుకు   3 నుండి 4 వందలు పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. విశాఖపట్నం డయాలిసిస్ కు వెళ్లుటకు ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసామన్నారు. ఇప్పటికి 92 మంది

డయాలిసిస్ చేసుకున్నారని తెలిపారు. సోంపేట, పలాసలో కూడా 5 బెడ్లు చొప్పున ఏర్పాటుచేసామని కలెక్టర్ వివరించారు. 

అనవసరంగా రోడ్లపైకి రావద్దు: ఎస్పీ

అమ్మిరెడ్డి. . . . 

జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి మాట్లాడుతూ ఉదయం 6.00గం.ల నుండి మధ్యాహ్నం 1.00గం.వరకే పంటల విక్రయానికి అనుమతి ఉందని,

మధ్యాహ్నం 1.00 తరువాత ఇతర మండలాలకు వెళ్ళడానికి అనుమతిలేదని స్పష్టం చేసారు.  à°…త్యవసరం లేనప్పుడు ప్రజలు బయటకు రావద్దని తెలిపారు. అంతర్ జిల్లా, రాష్ట్ర కదలికలు

మరింత కఠిన తరం చేస్తామని చెప్పారు. ఇతర ప్రాంతాల నుండి ఉద్యోగులు విధులకు హాజరు కావద్దని పేర్కొన్నారు. చెన్నై నుంచి వచ్చే మత్స్యకారుల కొరకు 40 చోట్ల పికెటింగ్

ఏర్పాటుచేసామని, ఇప్పటివరకు 6 బొట్లు సీజ్ చేసి,  82 మందిని క్వారంటీన్ కు తరలించడం జరిగిందని తెలిపారు, క్రిమినల్ కేసుల వలన ఇతరులు రావడానికి సాహసించడం లేదని

చెప్పారు. తీర ప్రాంతంలో గట్టి నిఘా కొనసాగుతోందని అన్నారు. 

à°ˆ విలేకరుల సమావేశంలో సంయుక్త కలెక్టర్ డాక్టర్ కె. శ్రీనివాసులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam