DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆపన్నులకు అండగా లీగల్ సర్వీసెస్ : జడ్జి కళ్యాణ్ చక్రవర్తి 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 22, 2020 (డిఎన్ఎస్) : ఆపన్నులను ఆదుకోవడంలో న్యాయసేవాధికార సంస్థ ఎప్పుడూ ముందుంటుంది.

జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి.*       ఆపత్కాలంలో ఆపన్నులను ఆదుకోవడంలో   న్యాయసేవాధికార సంస్థ ఎప్పుడూ ముందుంటుందని, అందులో భాగంగానే

జిల్లా వ్యాప్తంగా నిరుపేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. కరోనా నేపధ్యంలో

విధించిన లాక్ డౌన్ కారణంగా పనులు లేక ఆకలితో బాధపడుతున్న సుమారు 600 మందికి  à°¬à±à°§à°µà°¾à°°à°‚ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బియ్యం, పప్పులు, కూరగాయలు పంపిణీ

కార్యక్రమం చేపట్టారు. రాజమహేంద్రవరంలో జిల్లా కోర్టు ప్రాంగణంలోని న్యాయ సేవా సదన్ వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి ముఖ్య

అతిథిగా విచ్చేశారు. న్యాయశాఖ సిబ్బందికి, మున్సిపల్ ఉద్యోగులకు నిత్యావసర సరుకులను అందజేశారు. రామదాసు పేట, కోటిలింగాల పేట ప్రాంతాల్లో నిరుపేదలకు డిఎల్ఎస్ఎ

ప్యానల్ న్యాయవాదులు, పిఎల్వీలు బియ్యం, కందిపప్పు, కూరగాయలు అందజేశారు.  à°ˆ సందర్భంగా న్యాయమూర్తి సాయి కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ రోజు రోజుకూ పెరుగుతున్న

కరోనా పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఎవ్వరూ బయటకు రాకూడదన్నారు. ప్రతీ ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాన్నారు.

న్యాయసేవాధికార సంస్థ ద్వారా జిల్లా వ్యాప్తంగా పేదలకు నిత్యావసర వస్తువుల ను పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్మినెంట్ లోక్ అదాలత్ చైర్మన్

వెంకట ప్రసాద్, న్యాయమూర్తి కిషోర్ కుమార్, డిఎల్ఎస్ఎ సూపరింటెండెంట్ రుంజల వెంకట నాగమణి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్. ప్రభాకర్, సీనియర్ న్యాయవాది డోకల

అప్పారావు, డిఎల్ఎస్ఎ ప్యానల్ న్యాయవాదులు పేరిచర్ల సూర్యప్రభావతి, ధర్నాలకోట వెంకటేశ్వరరావు, గొట్టిముక్కల అనంతరావు, జెవివి రమణ, రాజేశ్వరి, పారా సంస్థ ఫాదర్

ఇగ్నేసియస్, పిఎల్వీలు మొగ్గ శ్రీను, వసంతరాయుడు, తురకల నిర్మల, లక్కోజు ఓంకార్, ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam