DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జర్నలిస్టులకు అత్యవసర ఆరోగ్య భద్రత కల్పించాలి: జన సేనాని  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి ). . .*

అమరావతి, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) : కరోనా విపత్తులోనూ తెలుగు రాష్ట్రాల్లోని జర్నలిస్టులు చాలా ధైర్యంగా

పని చేస్తూ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్న వీరందరికి ఆరోగ్య భద్రత కల్పించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసారు.

గురువారం విడుదల చేసిన ప్రకటనలో పాత్రికేయుల రక్షణ పై ప్రభుత్వాలు భాద్యత వహించాలన్నారు. ఇప్పడికే తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల జర్నలిస్టులు కూడా

క్వారంటైన్ కు వెళ్ళినట్లు తెలిసింది. పాత్రికేయులు తమ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొంటూ విధులు చేపట్టాలి. పొరుగున ఉన్న తమిళనాడులో 25 మంది, ముంబయిలో 50మందికిపైగా

జర్నలిస్టులకు కరోనా పాజిటివ్ అని తేలిన నేపథ్యంలో పాత్రికేయులకు అవసరమైన ఆరోగ్య భద్రత, బీమాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. జర్నలిస్ట్

సంఘాలు, మీడియా సంస్థలు జర్నలిస్టుల ఆరోగ్య రక్షణకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam