DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పోరాట సైనికులకు చిరు సత్కార గౌరవం పౌరుల భాద్యత:

*జాతీయ పాత్రికేయ సంఘం కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు*   

*(DNS రిపోర్ట్ : సత్య గణేష్ , రిపోర్టర్ , విశాఖపట్నం ). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 23, 2020 (డిఎన్ఎస్) : అత్యంత

విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజల రక్షణ కోసం పోరాటం చేస్తున్న సైనికులకు చిరు సత్కార గౌరవం పౌరుల భాద్యత అని  à°œà°¾à°¤à±€à°¯ పాత్రికేయ సంఘం కార్యదర్శి గంట్ల

శ్రీనుబాబు అభిప్రాయపడ్డారు. గురువారం విశాఖపట్నం లోని అక్కయ్యపాలెం రామచంద్ర నగర్ లో గురువారం పలువురు పారిశుద్ధ్య కార్మికులను ఘనంగా సత్కరించారు. ఈ

సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో వైద్యులు, పాత్రికేయులు, పొలిసు సిబ్బంది, సహా పారిశుధ్య కార్మికులు నిరంతరం ప్రజా సేవలోనే

తరిస్తున్నారన్నారు. వారి సేవలు అనిర్వచనీయమని, వాటిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో సేవలు అందించాలని భావించే

ప్రతి రోజు ఏదో à°’à°• ప్రాంతంలో à°’à°• సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు... నిరుపేదలు అందరినీ ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని,సేవలు  à°šà±‡à°¯à°¡à°¾à°¨à°¿à°•à°¿ ఇదే సరైన

సమయం అని ఆయన పేర్కొన్నారు.

మూవీ మైండ్స్ సంస్థ అధ్యక్షులు జేవి  à°ªà±à°°à°­à°¾à°•à°°à± తో కలిసి సంయుక్తంగా ఏర్పాటు చేసిన à°ˆ కార్యక్రమంలో జీవీఎంసీ అదనపు కమిషనర్

విశ్వనాద్ సన్యాసి రావు విశిష్ట అతిధిగా  à°ªà°¾à°²à±à°—ొన్నారు.  à°œà±‡à°µà±€ ప్రభాకర్  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ ప్రతిరోజు తమ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు

నిర్వహిస్తున్నామన్నారు.

అనంతరం పలువురు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యవసర వస్తువులు, వారి భద్రతకు సంబంధించిన సానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ఈ

సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ కరోనా వంటి విపత్తులో పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలు ప్రశంసనీయమన్నారు. వారి సహకారం వల్లే కరోనా ను అదుపు

చేసుకోగలిగామన్నారు. రెడ్ జోన్ల పరిధిలో కూడా వారి ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్నారన్నారు. à°—్రేటర్ లో  à°•à°¾à°°à±à°®à°¿à°•à±à°²à±à°•à±  à°…వసరమైన అన్ని సదుపాయాలు

కల్పించేందుకు తమ వంతు చర్యలు తీసుకున్నామన్నారు. 

à°ˆ కార్యక్రమంలో జోన్ 4 సహాయ మెడికల్ అధికారి రాజేష్, వార్డ్ ఇన్స్పెక్టర్ పాండురంగ, గోపి  à°¸à±à°¬à±à°°à°¹à±à°®à°£à±à°¯à°‚,

రాజకుమారి, గంట్ల హర్షవర్ధన్, సీతారామయ్య, పృద్వి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam