DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా రక్షణ లో పారిశుధ్య కార్మికుల పాత్ర భేష్ :జిల్లా జడ్జి బబిత

*(DNS రిపోర్ట్ : ఆచార్యులు S V, రిపోర్టర్ , శ్రీకాకుళం ). . .*

శ్రీకాకుళం, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) : కరోనా మహమ్మారి రాక్షసుడి బారిన పడకుండా ప్రజలను రక్షించడం లో పారిశుధ్య

కార్మికుల పాత్ర భేష్ à°—à°¾ ఉందని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి యం.బబిత ప్రశంసించారు. శుక్రవారం జిల్లా కోర్టు సముదాయం లో  à°œà°°à°¿à°—à°¿à°¨ కార్యక్రమం లో వాళ్ళ

సేవలను న్యాయమూర్తి కొనియాడారు. ముఖ్యంగా కరోనా నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన సందర్భంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయంటే అది పారిశుద్ధ్య కార్మికులు చేసిన

సేవలే అని కొనియాడారు. ఇటువంటి మహత్తర సేవలు అందిస్తున్న కార్మికులకు తమ వంతుగా ఏదైనా సహకారం అందించాలనే ఉద్దేశ్యంతో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి

శ్రీకారం చుట్టడం జరిగిందని పేర్కొన్నారు. 

అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ

ఏర్పాటుచేసింది. à°ˆ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని సుమారు 100 మంది పారిశుద్ధ్య కార్మికులకు సరుకులను పంపిణీ చేసారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ

ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రత ముఖ్యమని అన్నారు. జిల్లాలోని ఆసుపత్రులు, కార్యాలయాలు, రహదారులు ఇలా అన్నిరకాల పరిసరాలను రేయింబవళ్లు

పరిశుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు సేవలు అభినందనీయమని అన్నారు. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రభుత్వం పిలుపునిచ్చిన మేరకు సామాజిక దూరాన్ని పాటిస్తూ,

మాస్కులను వాడుతూ ఇటువంటి సేవలు అందిస్తున్న ప్రతీ కార్మికునికి హ్యాట్సాఫ్ చేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇంతటి మహోన్నత సేవలు అందిస్తున్న కార్మికులకు

చిరుకానుకను ఇచ్చి సత్కరించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్ణయించిందని, అందులో భాగంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకోవడం జరిగిందని తెలిపారు.

ఇందుకు సహచర న్యాయమూర్తులు తోడ్పాటునిచ్చారని, ఇదే స్పూర్తితో భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని ఆమె అన్నారు. 
కరోనా నేపధ్యంలో ప్రతీ

ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారాన్ని తీసుకోవాలని, ఇంటివద్దనే ఉండాలన్నారు. బయటకు వెళ్లే సమయంలో మాస్కులను తప్పనిసరిగా ధరించి, సామాజిక దూరాన్ని

పాటిస్తూ ఒక్క పాజిటివ్ కేసులేని జిల్లాగా శ్రీకాకుళంను తీర్చిదిద్దాలని ఆమె ఆకాంక్షించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.జయలక్ష్మీ

మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య కార్మికులు అందిస్తున్న సేవలను గుర్తించి వారికి చిరుకానుకను అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గారు ఆదేశించారన్నారు.

అందులో భాగంగా à°ˆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగిందని, ఇందుకు న్యాయమూర్తులందరూ కలిసి తమ స్వంత  à°¨à°¿à°§à±à°²à°¨à± వెచ్చించారని చెప్పారు. అనంతరం జిల్లా ప్రధాన

న్యాయమూర్తితో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. నగరపాలక సంస్థ కమీషనర్ పి.నల్లనయ్య మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య కార్మికుల

సేవలను ప్రతీ ఒక్కరూ గుర్తించారని, ఇది ముదావహమన్నారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికుల అందిస్తున్న సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. ఇప్పటికే

జిల్లా యంత్రాంగం, అధికారులు, ప్రజల మన్ననలను పొందారని, ఇంతటి మహత్తర సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులే సిసలైన సమాజసేవకులని ఆయన కొనియాడారు. కార్మికులు

అందిస్తున్న సేవలకు గుర్తుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటుచేయడం సంతోషకరంగా ఉందని, ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటుచేసిన

న్యాయమూర్తులకు అభినందనలు తెలిపారు. అనంతరం జిల్లా ప్రధాన న్యాయమూర్తితో కలిసి పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేసారు. 
  

 à°ˆà°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°‚లో ఫస్ట్ అడిషనల్ జడ్జ్ à°Ž.యస్.ఆంజనేయమూర్తి, థర్డ్ అడిషనల్ జడ్జ్ పి.అన్నపూర్ణ, ప్లాపల్స్ ఛైర్మన్ సి.సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సబ్ జడ్జ్ పి.వి.ప్రసాద్,

అడిషనల్ సబ్ జడ్జ్ వివేకానంద శ్రీనివాస్, ఎక్సైజ్ జడ్జ్ కిశోర్ కుమార్, మొబైల్ కోర్ట్ జడ్జ్ లెనిన్ బాబు, ఏ.డి.ఎం దేవి రత్నకుమారి, పిడిఎం ఆర్.శాంతిశ్రీ, జిల్లా బార్

అసోసియేషన్ అధ్యక్షులు శిష్టు రమేష్, కార్యదర్శి కృష్ణప్రసాద్ , నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారి à°¡à°¾. జి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam