DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైల్వే జోన్ నా పదవి ఉండగానే వస్తుంది : విశాఖ ఎంపీ 

విశాఖ రైల్వే స్టేషన్ లో మరో రెండు ఎస్కలేటర్లు ప్రారంభం 

విశాఖపట్నం, జులై 3, 2018 (DNS Online ): ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజల చిరకాల వాంఛ అయినా విశాఖ పట్నం కేంద్రం గా

రైల్వే జోను ఏర్పాటు నా పదవీ కాలం ముగియముందే సాధిస్తామని విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్ కె. హరిబాబు తెలిపారు. మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో

ఏర్పాటు చేసిన మరో రెండు ఎస్కేలేటర్లు అయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే ప్రయాణీకుల సౌకర్యార్ధం విశాఖపట్నం రైల్వే విభాగం

మరిన్ని సదుపాయాలు కల్పిస్తోందన్నారు. విశాఖపట్నం నుంచి వివిధ గమ్యస్థానాలకు రాక పోకలు సాగించే పెద్దవారు, మహిళలు, నడవలేని వారు తదితరులకు ఈ ఎస్కలేటర్లు చాలా

ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ప్లాట్ ఫామ్ 1 , 8 లపై చెరొకటి ఏర్పాటు చేశారు. అత్యధిక ప్రయాణీకులు వీటిని సద్వినియోగం చేసుకునే విధంగా వీటిని వినియోగం లోకి

తీసుకురావాలని రైల్వే అధికారులకు సూచించారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ అత్యంత పరిశుభ్రమైన కేంద్రాల్లో గత ఏడాది మొదటిస్థానం లో ఉందని, దీనికి ప్రధానంగా

విశాఖ రైల్వే డి ఆర్ ఎం, సిబ్బంది తో పాటు ప్రయాణీకులు కూడా అభినందనీయులన్నారు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ ను మరింత ఆధునీకరించి, ఒక ఆధునిక విమానాశ్రయం తరహాలో

తయారు చేయాలి అనే సంకల్పం లో à°¡à°¿ ఆర్  à°Žà°‚ ముకుల్ శరన్ మాధుర్ కృషి చేస్తున్నారన్నారు. ఇటీవలే  à°®à°¹à°¿à°³à°¾ ప్రయాణీకులకు రక్షణ కల్పించే విధంగా 32 మంది రైల్వే పోలీసు

విభాగం, రైల్వే టికెట్ విభాగం సిబ్బందితో సుభద్ర వాహిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వివిధ రైళ్లల్లో ప్రయాణించే మహిళలు, బాలికలకు, వృద్దులకు ఎటువంటి అసౌకర్యం

కలుగకుండా à°ˆ బృందం సేవలు అందిస్తోందని, వారిని అభినందించారు. 
విశాఖనగరం లోని హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రీసైక్లింగ్

పరికరాన్ని కూడా అయన ప్రారంభించారు. à°ˆ కార్యక్రమం లో విశాఖపట్నం రైల్వే à°¡à°¿ ఆర్ à°Žà°‚ ముకుల్ శరన్ మాధుర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam