DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఖండాంతరాలు కలుపుతున్న ద్వారం లక్ష్మి అఖండ సంగీతార్చన 

*లాక్ డౌన్ సమయంలో కూడా సరస్వతికి సంగీత నిత్యోత్సవాలే*

*వేలాది మంది గానామృతంతో ఉపశమన యజ్ఞానికి శ్రీకారం*  

*అపరగాన సరస్వతి ద్వారం లక్ష్మి

సారధ్యంలో సంగీత యజ్ఞం* 

*ఇళ్లనుంచే పాల్గొంటున్న లక్షలాదిగా గాయనీ గాయకులు*   

*ఆశీస్సులు అందిస్తున్న ఆధ్యాత్మికవేత్తలు, ఆచార్యులు*  

*(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 24, 2020 (డిఎన్ఎస్) : అత్యంత విపత్కర పరిస్థితుల్లో లాక్ డౌన్ నేపథ్యంలో ఏ ఆలయం లోనూ భక్తుల నుంచి

అర్చనలు లేకపోయినా, సరస్వతి కి మాత్రం అఖండ సంగీత నీరాజన అర్చనలు అందుతూనే ఉన్నాయి. దేశ విదేశాల్లోని ప్రజలంతా లాక్ డౌన్ లో ఉన్న నేపథ్యంలో ఖండ ఖండాంతరాలను

కలుపుతూ సంగీత సరస్వతి à°•à°¿ అత్యంత వైభవంగా నీరాజనం అందుతూనే ఉన్నాయి. 

అపరగాన సరస్వతి విదుషీమణి, డాక్టర్ ద్వారం లక్ష్మి నేతృత్వంలో ప్రారంభమైన అఖండ గాన

కళా ఉత్సవాలు లాక్ డౌన్ ముగిసే వరకూ కొనసాగనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానముల నిర్వహణలోని  à°¶à±à°°à±€ పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంలో సంగీత విభాగం అధిపతిగా

అత్యంత ఉన్నత స్థితిలో ఉద్యోగ భాధ్యతలను నిర్వహిస్తున్న ద్వారం లక్ష్మి తమ విభాగపు పూర్వ విద్యార్థులతో à°ˆ కార్యక్రమాన్ని నిర్వహించాలని సంకల్పించారు.  24 గంటలూ

నిరంతరాయంగా సాగుతున్న ఈ యజ్ఞంలో ఇందులో భాగం గా అందరు సంగీత విద్వాంసులు వారివారి ఇళ్లల్లో ఉంటూనే వారికి కేటాయించిన సమయంలో గానం చేస్తున్నారు. దీనికోసం దేశ

విదేశాల్లో ఉన్న ఎంతో మంది కళాకారులు à°ˆ బృందంతో కలిసి గానామృతం చేస్తున్నారు. కేవలం కొందరితో మొదలైన à°ˆ యజ్ఞం ప్రస్తుతం 7 గ్రూప్స్ లో  à°¨à°¿à°°à°‚తరం à°ˆ గాన యజ్ఞంలో

ప్రపంచ వ్యాప్తంగా నిరంతరాయం గా స్వరార్చన చేస్తున్నారు.

ఆధ్యాత్మిక వేత్తల ఆశీస్సులు : . .. 

సంగీత స్వరార్చన యజ్ఞాన్ని ప్రశంసిస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక

వేత్త చాగంటి కోటేశ్వర రావు, ప్రఖ్యాత రచయిత తనికెళ్ళ భరణి, ప్రఖ్యాత సంగీత విద్వాంసులు అన్నవరపు రామస్వామి, పద్మావతీ మహిళా విశ్వవిద్యాలం ఉపకులపతి డాక్టర్

జామున దువ్వూరు, వేదిక్ విశ్వ విద్యాలయం ఉపకులపతి సన్నిధానం సుదర్శన శర్మ  à°µà°‚à°Ÿà°¿ పెద్దలు ఆశీస్సులు అందిస్తున్నారు.

చిన్నారుల నుంచి టాప్ గ్రేడ్ కళాకారుల

వరకూ. . .

చిన్నారుల నుంచి సంగీత విజ్ఞానం లో టాప్ గ్రేడ్ కళాకారుల వరకూ ఉత్సాహంగా ఈ సంగీత స్వరార్చనలో పాల్గొంటూ సంగీత సరస్వతి కి అఖండ నీరాజనం

అందిస్తున్నారు. à°¸à°‚గీత సాధన ద్వారా వర్షాలు కురిసిన సందర్భాలు, దీపాలు వెలిగించిన నిదర్శనాలు చరిత్ర ఆధారంగా నిలిచాయి. అయితే ప్రస్తుత కరోనా మహమ్మారిని సమాజం

నుంచి పారద్రోలే కృషి లో సంగీత స్వరార్చన కూడా భాగం అవ్వాలనే ఆశ కు పెద్దల ఆశీస్సులు కూడా తోడవుతాయనే  à°¬à°²à°®à±ˆà°¨ సంకల్పంతో à°ˆ యజ్ఞం జరుగుతోంది .

సంగీత సరస్వతి

లక్ష్యం సాకారమే. . . 

à°ˆ  à°¸à°‚గీత యజ్ఞానికి మల్లాప్రగడ  à°¶à±à°°à±€à°®à°¨à±à°¨à°¾à°°à°¾à°¯à°£ మూర్తి ఆశీర్వచనాన్ని అందిస్తూ. . .  సామవేదం నుండి సంగీతం పుట్టిందనీ à°† సంగీతం పరమాత్మకు

ఎంతో ప్రీతిపాత్రమనీ   స్వరార్చనకు ప్రసన్నుడై సర్వాంతర్యామి మనకు అభీష్ట సిద్ధిని ప్రసాదిస్తాడనీ అన్నారు.

సంగీతాన్ని కేవలం కళగా చూసేవాళ్ళు ఉన్నారని,

అయితే జీవన నాదంగా మార్చుకున్న వాళ్లలో ద్వారం లక్ష్మి అగ్రగామిగా నిలిచారని ఆశీస్సులు అందించారు. వీరి సంకల్పంతో గళం కలుపుతున్న విశ్వ మానవాళి ఈ విలయంనుండి

ఉపశాంతిని పొందేవరకు ఈ స్వరసమర్చనదీక్ష ఇలాగే కొనసాగుతుందన్న దృఢసంకల్పంతో ఉద్యమిస్తున్న ఈ సంగీత మూర్తు లందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని, పెద్దలు

వ్యాఖ్యానించడం ఈ యజ్ఞానికి ఎంత ప్రాధాన్యత ఉందొ తెలుస్తోంది.

కరోనా  à°®à°¹à°®à±à°®à°¾à°°à°¿ నేపధ్యం లో గొప్ప సేవ లో వైద్యులు మరియు మెడికల్ పారా వైద్య సిబ్బంది, పోలీ

సిబ్బంది  à°—ురించి నేను చాలా  à°—ొప్పగా భావిస్తున్నాను. అలాగే à°…నేక సంస్థలు మరియు వ్యక్తులు చేసిన సామాజిక సేవ గురించి విన్న తరవాత
ఈ సంగీత స్వరార్చన అన్న

కార్యక్రమం చేయాలన్న తలంపు à°’à°• ఫ్లాష్ లా   వచ్చింది.     ... మనం మ్యూజిక్‌తో ఎందుకు ప్రార్థన చేయకూడదు, ఇది అత్యంత శక్తివంతమైన విద్య, దేవుడే స్వయంగా గుర్తించబడింది,

భగవంతుడు నాదలోలుడు  à°•à°¾à°µà°¡à°‚, ఇది కళాకారులు మనం  à°®à°¾à°¤à±à°°à°®à±‡ చేయగలిగేది , మనం ఎందుకు విరామం లేకుండా ప్రార్థన చేయకూడదు , సమూహ ప్రార్థనలు మరింత శక్తివంతమైనవి అన్న

తలంపు ఒక్క సారిగా మార్చ్ నెల 21  à°µ  à°¤à±‡à°¦à±€à°¨ తట్టింది.

ప్రభుత్వ సూచనలను ఖచ్చితంగా  à°ªà°¾à°Ÿà°¿à°¸à±à°¤à±‚, à°°à°¾à°·à±à°Ÿà±à°° మరియు  à°•à±‡à°‚ద్ర ప్రభుత్వాల లాక్ డౌన్ నియమాలను పాటిస్తూ

ఇళ్ల నుండి బయటికి వెళ్లకుండా సంగీత స్వరార్చన ద్వారా శాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.

స్వామి అనుగ్రహానికి చక్కని అర్చన : చాగంటి . . . 

ద్వారం

లక్ష్మి సారధ్యంలో సాగుతున్న à°…à°–à°‚à°¡ సంగీత స్వరార్చన వివరాలు తెలుసుకున్న ప్రాముఖ్య ఆధ్యాత్మిక వేత్త చాగంటి కోటేశ్వర రావు  à°ˆ కార్యక్రమం బహుదా

ప్రశంసనీయమైనదన్నారు. సనాతన ధర్మం లో భగవంతుని అనుగ్రహం తగ్గినప్పుడు అనేకరకాలైన ఉత్పాతాలు, కరోనా వంటి మహమ్మారులు విజృంభిస్తాయన్నారు. 

ఇటువంటి వాటిని

తగ్గించడానికి సంగీతానికి యెనలేని ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే సంగీతం సామవేదాంతర్గతం. సామ అంటేనే సాంతం అని అర్ధం. ఆ సాంతం ఆరోగ్యం ద్వారానే సంభవం. సంగీతం

నేర్చుకున్నవారంతా à°’à°• బృందంగా ఏర్పడి, గానం చేయడం   ద్వారా భక్తితో కూడిన à°† సంగీత ధ్వని తరంగాలు భగవంతుని తాకి స్వామి వారి అనుగ్రహం త్వరగా

లభిస్తుంది.

ఖండాంతరాలు నుంచి ప్రాతినిధ్యం ఇదే . . . 

à°…à°–à°‚à°¡ భారతావని లో తిరుమల శ్రీనివాసుని పాదాల చెంత మొదలైన à°ˆ సంగీత వైభవం à°šà°‚ద్రగిరి, విజయవాడ, తిరుపతి,

శ్రీరంగం,  à°šà±†à°¨à±à°¨à±†à±–, బెంగుళూరు, హరిద్వార్, పలమనేరు, పుత్తూరు, శ్రీకాళహస్తి, చిత్తూరు, విశాఖపట్నం, హైదరాబాద్, న్యూఢిల్లీ, రాజమండ్రి, అనంతపురం, విజయనగరం, పూనే,

ఏలూరు, మదనపల్లె, నెల్లూరు, ముంబై, ఖమ్మం, మైసూరు, నరసాపురం, పాలకొల్లు తో పాటు ఎన్నో గ్రామా గ్రామాల నుంచి కళాకారులూ స్థాయి భేదం లేకుండా

పాల్గొంటున్నారు. 

ఖండాంతరాలైన అమెరికా,  à°‡à°‚గ్లాండ్, దుబాయ్, ఆస్ట్రేలియా, యుఎఇ, కెనడా, తదితర దేశాల నుంచి ఎందరో సంగీత విద్వాంసులు à°ˆ సంగీత బ్రహ్మోత్సవాల్లో

తాము సైతం భాగస్వాములవుతున్నారు. 

గానామృతం లో సాగే సాధన ఇదే : . . . 

à°ˆ సంగీత స్వరార్చన లో వివిధ దేవీ దేవతలు,  à°…మ్మ వార్లు, స్వామి వార్లను కీర్తిస్తూ  à°…ందరు

సంగీత వాగ్గేయకారుల రచనలను అత్యంత వైభవంగా గానం చేస్తూ విశ్వాంతరాలకు కనీ వినీ ఎరుగని సంగీత బహుమానాన్ని అందిస్తున్నారు.  

ప్రముఖ వాగ్గేయకారులు శ్యామ

శాస్త్రి  à°•à°¾à°®à±‡à°¶à±à°µà°°à°¿ అమ్మ వారి మీద  à°¸à±à°µà°°à°œà°¤à±à°²à°¨à± అందరు సంగీత కళాకారులు పాడుతున్నారు, సంగీత వాయిద్యాల ద్వారా వాయిస్తున్నారు.  

ప్రతి ఒక్కరూ ప్రభుత్వ లాక్

డౌన్ నిబంధనలను పూర్తిగా పాటిస్తూ, వారి వారి ఇళ్ల నుండి బయటికి వెళ్లకుండా సంగీత స్వరార్చన ద్వారా శాంతి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. à°ˆ సంగీత స్వరార్చన లాక్

డౌన్ పీరియడ్ అయ్యేంత వరకు నిర్విఘ్నంగా, నిరాఘాటంగా కొనసాగనుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam