DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికార పార్టీ క్యాడర్ పంపిణీల్లో కనుచూపులో కానరాని కనీస దూరం 

*అదుపు చెయ్యడంలో చేతులెత్తేస్తున్న ప్రభుత్వ అధికారగణం*   

*ప్రభుత్వ నిబంధనలు ప్రజలకేనా? పార్టీ క్యాడర్ కు కాదా?*

*ఒక్క నేత వెంటే డజన్ల కొద్దీ

కార్యకర్తలు, విజయ సాయి ఉంటె చిన్న పాటి జాతరే* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 25, 2020 (డిఎన్ఎస్) : భారత దేశం యావత్తు లాక్ డౌన్

పాటిస్తూ కనీస దూరం పాటిస్తుంటే. . . ఆంధ్ర లో అధికార పార్టీ నేతలు నిర్వహిస్తున్న పంపిణీల్లో ఏమాత్రం  à°–ాతరు లేకుండా పోతోంది. పైగా ప్రజలు à°ˆ నిబంధనలు పాటించడం లో

కొంతవరకూ కృషి చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నేతలు, క్యాడర్ మాత్రం ఏమాత్రం దీన్ని ఖాతరు చెయ్యడం లేదని తెలుస్తోంది. ఆర్తులకు ఆహార పదార్దాలు అందించడాన్ని

అందరూ అభినందిస్తున్నారు, అయితే ఈ క్రమం లోనే ప్రతి ఒక్కరూ కనీస దూరం పాటించాల్సి యుంది. సాక్షాత్తు విశాఖ లోక్ సభ సభ్యుడు ఎం వివి సత్యనారాయణ పాల్గొంటున్న

సభల్లోనే అయన వెంటే డజన్ల కొద్దీ అనుచరగణం, అధికార పార్టీ క్యాడర్ పాల్గొంటూ అదే వేదికపై దర్శనమిస్తున్నారు. దీన్ని సాక్షాత్తు ఆ పార్టీ అభిమానులే తప్పు

పడుతున్నారు. ఇక అధికార పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి పాల్గొనే సభలైతే చిన్న పాటి జాతర నే తలపిస్తున్నాయి. 
ఇది ఏ ఒక్క ప్రజా

ప్రతినిధికో పరిమితం కాదు, ఇతర సామాన్య నేతలు పాల్గొన్న సభల్లోనూ, పంపిణీ కార్యక్రమాల్లోనూ ఇదే తరహా డజన్ల సంఖ్యలో అనుచర వర్గాలు ఇబ్బడి ముబ్బడిగా లాక్ డౌన్

నిబంధనలను తుంగలోకి తోక్కేస్తున్నారు. దీనికి ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ప్రత్యక్ష సాక్షులుగా నిలుస్తున్న వాళ్ళేమీ చెయ్యలేని పరిస్థితి. ఇక సామాన్య

కార్యకర్త కూడా ప్రజా ప్రతినిధి స్థాయిలోనే రాజభోగాన్ని అమలు చేస్తుండడం గమనార్హం. రైతు బజార్లు సందర్శించిన సమయాల్లో సైతం జిల్లా మంత్రి వెంట పెద్ద సంఖ్యలోనే

క్యాడర్ పాల్గొనడం గమనార్హం. 

కేవలం ప్రజల వరకే లాక్ డౌన్ నిబంధనలను అమలు చేస్తున్న పోలీస్ యంత్రాంగానికి అధికార పార్టీ నిబంధనల బేఖాతరు వైఖరి పట్టడం లేదా

లేక, నిప్పుతో చెలగాటం ఎందుకని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారా అనేది తెలియాలి. కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన మీడియా వారిని సైతం పోలీసులు చాలాసార్లు

ఇబ్బందులకు గురిచేసిన దాఖలాలు విశాఖనగరం లోనే చూసాం. అలాంటిది అధికార పార్టీ నేతలు, క్యాడర్ కు మాత్రం రెడ్ కార్పెట్ పరవడం కడుశోచనీయంగా ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam