DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పేరుకు చిన్న నటి. . ఉదారం లో మాత్రం మహా మేటి ప్రణీత 

*సినీ ఇండస్ట్రీ à°•à°¿ మంచి పాఠం నేర్పుతున్న నటి ప్రణీత* 

*21 రోజులుగా సొంత నిధులతో వేలాది మంది à°•à°¿ ఆహార పంపిణీ* 

*పెద్ద తరాలకు చేస్తున్న ఆహార పంపిణీ

ఛాలెంజ్. . .*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, ఏప్రిల్ 26, 2020 (డిఎన్ఎస్) : పేరుకు చిన్న నటి ప్రణీత, ఉదరం లో మాత్రం తానూ మహా మేటి అని

నిరూపిస్తున్నారు  సినీ నటి ప్రణీత. కరోనా మహమ్మారి ప్రభావంతో జరుగుతున్న లాక్ డౌన్ నేపథ్యంలో à°—à°¤ 21 రోజులుగా సొంత నిధులతో వేలాది మంది కార్మికులు, నిరుపేద

కుటుంబాల వారికి రెండు పూటలా ఆహారాన్ని అందిస్తున్నారు. అత్యంత శుచి శుభ్రతలతో స్వయంగా తాను కూడా వంటలో భాగస్వామి అవుతూ. . . ఆహారాన్ని తయారు చేస్తున్నారు. ఈ క్రమం

లోనే ఈమె చేస్తున్న పని సినీ పరిశ్రమలో కొందరికి ఒక గుణపాఠం గా కూడా మారుతోంది. సినీ పరిశ్రమలో అగ్ర స్థానంలో ఉన్న వారు వాళ్ళ ఇళ్లల్లో సొంత పనులు చేసుకోవడమే

దేశానికి పెద్ద ఉద్దరింపు అని భావిస్తున్న సందర్బంలో చిన్న నటి ప్రణీత చేస్తున్న కార్యాచరణ మహోన్నతంగా కనిపిస్తోందని కొందరు సినీ విమర్శకులు

ప్రకటిస్తున్నారు. తానూ చేస్తున్న పని గురించి నటి ప్రణీత ఎక్కడా ప్రచారం చేసుకోవడం లేదు సరికదా, మీడియా వారిని సైతం దూరం పెడుతున్నారు. అయితే ఈ కార్యాచరణలో

పాల్గొన్న వారు అందరికీ స్ఫూర్తిగా ఉంటుందనే ఉద్దేశంతో ఫోటోలను బయట పెట్టడం జరిగింది. 

కొందరు విరాళాలు ప్రకటించినా, అవి పేదలకు ఎంతవరకూ చేరతాయో అనేది

ఎవరికీ తెలియదు. ఇళ్లల్లో అంట్లు తోముతు, బట్టలు ఉతుకుతూ, తోటలో నీళ్లు పెడుతు, ఇల్లు ఊడుస్తూ ,ఛాలెంజ్ లు విసురుకుంటున్న ప్రముఖుల ఛాలెంజ్ ల తో ప్రజలకు ఎటువంటి

లబ్ది ఉండదు. వీళ్ళు కూడా ప్రణీత తరహాలో ఆహార పంపిణీ లాంటి ఛాలెంజ్ లు విసిరితే, వారి అభిమానులు సైతం మరింతగా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam